Work From Home: రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేక మందికి పెద్ద వరంగా మారింది. ఒకేసారి రెండు ఉద్యోగాలను నిర్వహించి ఆర్థికంగా లాభపడిన వారు ఎందరో. అయితే ఇదే వారికి ఇప్పుడు పెద్ద శాపంగా మారుతోంది. కంపెనీల బాస్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని చూస్తున్నట్లు వెల్లడికావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

రెండేళ్లుగా వరం.. రెండు నెలలుగా శాపం..
గడచిన రెండేళ్లకు పైగా కాలంలో చాలా మంది రిమోట్ వర్క్ పద్ధతిలో తమ పని చేసుకుంటూనే.. పార్ట్ టైం మరో రూపంలో ఆదాయాన్ని పొందుతున్నారు. దీనినే టెక్ ప్రపంచంలో మూన్ లైటింగ్ అని పిలుస్తుంటారు. అయితే ఇలాంటి డబుల్ గేమర్స్ ని పట్టుకోవటానికి యాజమాన్యాలు ఫిక్స్ అయ్యాయని చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్ (CiPD) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

సర్వేలో ఏమని తేలింది..
ఈ సర్వే కంపెనీలకు చెందిన 2000 మంది ఉన్నతాధికారులతో CiPD నిర్వహించింది. ఇందులో 55% మంది ఉన్నతాధికారులు తమ ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించబడాలని అభిప్రాయపడ్డారు. అంటే.. ఇంటి దగ్గర నుంచి తమ ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారు, వారి వర్క్ ఎఫీషియన్సీ, పెర్ఫామెన్స్, యాక్యురెసీ వంటి విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందేనని అన్నారు.

వీటిని పరిశీలిస్తారట..
ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌లపై ఉద్యోగి గడిపిన సమయం నుంచి వారు పంపే ఈ-మెయిల్స్ వరకు అన్ని రిమెట్ వర్కర్స్ డేటా సేకరించాలని సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీని ద్వారా లీస్ట్ పెర్ఫామర్స్ ను గుర్తించి తొలగించాలని యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పది మందిలో ముగ్గురు అధికారులు వెల్లడించిన దాని ప్రకారం తమ కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని సాఫ్ట్‌వేర్ ద్వారా ఇప్పటికే ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఈజీ కాదు..
ఇంటి నుంచి పనిచేయటం అనేది పదునైన కత్తిలా మారింది. ప్రస్తుతం అనేక కంపెనీలు మెల్లగా హైబ్రిడ్ వర్క్ విధానానికి మారిపోతున్నాయి. మరికొద్ది నెలల్లో ఈ విషయంలో పెను మార్పులు కనిపించనున్నాయని ఇండస్ట్రీ చెప్పకనే చెబుతోంది. కాబట్టి ఒక వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చినా అది ఇంతకు ముందంత సులువుగా మాత్రం ఉండదని తెలుస్తోంది. వర్క్ ఆడిట్ విధానం వల్ల నిరంతరం ఉద్యోగి పనితీరును కంపెనీలు లెక్కిస్తూనే ఉంటాయి.
More From GoodReturns

చమురు ధరలు పెరుగుదల.. ఖర్చులు భరించలేకున్నాం.. వెంటనే వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్..

50 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. దిగ్గజ కార్ల కంపెనీ Volkswagen సంచలన ప్రకటన..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications