రష్యా-ఉక్రెయిన్ మధ్య వాతావరణం చల్లబడిన తర్వాత క్రిప్టో మార్కెట్ పుంజుకుంది. వరల్డ్ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 47,000 డాలర్లు క్రాస్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 46,040 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 47,000 మార్కును దాటింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 732 మిలియన్ డాలర్లు పెరగగా, మొత్తం మార్కెట్ క్యాప్ 874.85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా 3500 డాలర్లను సమీపించింది. అన్ని క్రిప్టోలు ఇటీవల సానుకూలంగా కదలాడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లలో దాదాపు సగానికి పైగా 2021లోనే క్రిప్టో మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ న్యూ-ఏజ్ అసెట్ క్లాస్ పెట్టుబడి సాధనం చాలాకాలంగా ఉన్నప్పటికీ, కరోనా తర్వాత అందరి దృష్టి పడింది. దీంతో ఇప్పుడున్న క్రిప్టో ఇన్వెస్టర్లలో సగానికి పైగా గత క్యాలెండర్ ఏడాదిలోనే కొత్తగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని ఓ క్రిప్టో ఎక్స్చేంజ్ తెలిపింది.

ఈ మేరకు సదరు సంస్థ భారత్ సహా ఇరవై దేశాల్లో 30,000 మందితో సర్వే నిర్వహించింది. ఈ సర్వేను నవంబర్ 23, 2021 నుండి ఫిబ్రవరి 4, 2022 మధ్య నిర్వహించింది. ఇందులో అడల్ట్స్ నుండి 75 ఏళ్ల వ్యక్తులు కూడా పాలుపంచుకున్నారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పుడున్న సగం మంది క్రిప్టో ఇన్వెస్టర్లు 2021 క్యాలెండర్ ఏడాదిలోనే సగం మంది పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. గ్లోబల్ క్రిప్టో ఇన్వెస్టర్లలో 41 శాతం మంది 2021లో జత కలిశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications