2021 సంవత్సరంలో పరిస్థితులు మెరుగుపడతాయని, కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని 40 శాతం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. లింక్డిన్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యయి. మున్ముందు పరిస్థితులు మెరుగుపడతాయని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 19 శాతం మంది అభిప్రాయపడగా ఇప్పుడు 40 శాతానికి పెరిగింది. 2021లో తమ కంపెనీలు మరింతగా రాణిస్తాయని 53 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో కోట్లాది ఉద్యోగాలు పోవడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. గత మూడు నాలుగు నెలలుకా కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లింక్డిన్ సర్వే నిర్వహించింది.

ఇండియా ఆశాజనకం
లింక్డిన్ ఇయర్ ఎండ్ డేటా ప్రకారం కరోనా కారణంగా ఈ ఏడాది ప్రజలు పని చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. భారత్ పరిస్థితులు ఆశాజనకంగా ఉంది. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఆశాజనక పరిస్థితి స్కోర్ 50 నుండి 57 మధ్య దాదాపు స్థిరంగా ఉంది. నియామక ప్రక్రియ కూడా కాస్త వేగవంతమైంది.
అక్టోబర్ నెలలో కరోనా ముందుస్థాయికి చేరుకొని ఏడాది ప్రాతిపదికన 46 శాతంగా నమోదయింది. ఆన్‌లైన్ లెర్నింగ్, డిజిటల్ నైపుణ్యాలు 2020లో కేంద్రీకృతమయ్యాయి. లింక్డిన్ సర్వే ప్రకారం సగటున నెలసరి నేర్చుకునే సమయం జనవరి నుండి ఫిబ్రవరి కాలంతో పోలిస్తే ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మూడు రెట్లు పెరిగింది.

ఒత్తిడికి..
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు (57 శాతం) ప్రొఫెషనల్స్ ఆన్‌లైన్ లర్నింగ్ సమయం పెరిగినట్లు ఈ సర్వేలో తెలిపారు. అయితే ఒంటరిగా వర్క్ చేయడం వంటి వివిధ అంశాలు మానసిక, ఆర్థిక దృక్పథంపై ప్రతికూలంగా మారినట్లు తెలిపారు. నవంబర్ 2020 నాటికి 78 శాతం మంది నిరుద్యోగ నిపుణులు ఒత్తిడికి గురయ్యారు.
వచ్చే ఏడాది ఆదాయం పెరుగుతుందని 32 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా ముందు కంటే తాము వర్క్ పైన తక్కువగా కూర్చుంటున్నామని 61 శాతం మంది చెప్పగా, అదే సమయం లేదా ఎక్కువ సమయం కూర్చుంటున్నామని 87 శాతం మంది చెప్పారు.

ఉద్యోగాలు పెరుగుతాయి
ప్రతి ఐదుగురిలో ఇద్దరు కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పగా, ఇద్దరిలో ఒకరు కంపెనీలు వచ్చే ఆరు నెలల కాలంలో మంచి పనితీరు కనబరుస్తాయని చెప్పారు. 2020 విధ్వంసకర సంవత్సరంగా నిలిచింది. సవాళ్లను అధిగమించి కొత్త మార్పులకు అనుగుణంగా 2021లో ముందుకు వెళ్లేలా కంపెనీలు పని చేస్తాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications