అమెరికాలో $150,000 (దాదాపు కోటి రూపాయల పైన) జీతం సంపాదిస్తున్న ఒక భారతీయ ఉద్యోగి.. భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరు (Bengaluru) లో రూ.32 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో పనిచేయడం సరైన నిర్ణయమేనా? అని రెడిట్ (Reddit) వేదికగా అడిగిన ప్రశ్న ప్రస్తుతం ఆన్‌లైన్ లో పెద్ద చర్చకు దారితీసింది.

అమెరికాలో పని చేస్తూ 15 ఏళ్ల అనుభవం ఉన్న ఒక ఉద్యోగి రెడిట్ వేదికగా ఒక ప్రశ్న అడిగాడు. "నేను ఒక్కడినే ఇంట్లో సంపాదించే వ్యక్తిని, కుటుంబంలో ముగ్గురం ఉన్నాం. బెంగళూరులో రూ.32 లక్షలు vs అమెరికాలో 1,50,000 డాలర్లు ? వీటిలో ఏది బెటర్?" అని అడిగారు. అయితే ఈ పోస్ట్, కేవలం జీతం లెక్కల గురించి కాకుండా, క్వాలిటీ లైఫ్, ట్యాక్స్, కెరీర్ డెవలప్ మెంట్ వంటి పలు అంశాలపై విస్తృత చర్చకు తెరతీసింది.
నెంబర్స్ వర్సెస్ నైపుణ్యం
రెడిట్(Reddit) యూజర్ల నుంచి వచ్చిన స్పందనలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయి.. అవేంటంటే..
1. జీతం తక్కువే!
చాలా మంది నెటిజన్లు రూ.32 లక్షల ఆఫర్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ ప్రొఫెషనల్‌కు బెంగళూరు(Bengaluru)లో రూ.32 లక్షలు సరైన జీతం కాదని చాలా మంది గట్టిగా వాదించారు. "₹32 లక్షలు vs $150K పోలికలో బెంగళూరు ఆఫర్ చాలా తక్కువ. 15 సంవత్సరాల అనుభవానికి రూ.80 లక్షల వరకు మార్కెట్ జీతం ఉంటుంది. అంతకంటే తక్కువకు తిరిగి రావడం సరైనది కాదు" అని మరి కొందరు సూచించారు.
2. అమెరికాలో ఉండటం బెస్ట్!
మరికొందరు నేరుగా అంకెలను మాత్రమే చూస్తూ, "అమెరికానే బెస్ట్. 150,000 డాలర్ల ముందు ఇండియాలో ఏదీ సరిపోదు" అని స్పష్టం చేశారు.
3. ప్రాంతాన్ని బట్టి ఖర్చు
ఇకపోతే మరి కొంతమంది నెటిజన్లు మాత్రం కేవలం అంకెలను కాకుండా ఆ ఉద్యోగి అమెరికాలో నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి విశ్లేషణ చేశారు. ఒకవేళ మీరు అమెరికాలోని బే ఏరియా (Bay Area) వంటి ఖరీదైన నగరంలో ఉంటే ముగ్గురి కుటుంబానికి $150,000 కూడా సరిపోకపోవచ్చు అని అన్నారు. ఇంకొక యూజర్ "నేను భారతదేశంలో కోటి రూపాయలకు పైగా జీతం సంపాదించేవాడిని. తర్వాత $150,000 జీతంతో అమెరికాలోని ఓ చిన్న నగరానికి వెళ్లాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. మంచి సేవలు, ప్రశాంతమైన జీవితం దొరకనప్పుడు డబ్బు ఎంత ఉన్నా వృథానే." అని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.
తుది నిర్ణయం దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఈ విశ్లేషణ మొత్తాన్ని పరిశీలిస్తే, ₹32 లక్షలు vs $150K పోలిక కేవలం ఆర్థికం కాదు. ఒకవేళ ఆ ఉద్యోగి ప్రధాన లక్ష్యం డబ్బు ఆదా చేయడమైతే.. $150,000 జీతమే మెరుగైనది. రూ.32 లక్షల జీతంతో బెంగళూరు(Bengaluru)లో ఉంటే ముగ్గురి కుటుంబానికి అయ్యే ఖర్చులు తీసివేస్తే, పొదుపు చాలా తగ్గుతుంది. అలాగే టెక్సాస్ వంటి ప్రశాంతమైన నగరాల్లో ఉండే క్వాలిటీ లైఫ్, ప్రశాంతత బెంగళూరులో ఉండకపోవచ్చు. కాబట్టి నిర్ణయం అనేది వ్యక్తిగత ప్రధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications