అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాకుండా అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారతదేశాన్ని మిత్ర దేశమని పేర్కొంటూనే గునపం గుచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని, కఠినమైన వాణిజ్య అడ్డంకులతో అమెరికా ఉత్పత్తులపై పరిమితులు విధిస్తోందని విమర్శలు గుప్పించారు.
దీంతో పాటుగా రష్యా నుండి కొనుగోలు చేసిన ఇంధనం, ఆయుధాలపై అదనపు జరిమానాలు కూడా విధించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్‌తో భారత్ చమురు వ్యాపారం నేపథ్యంలో 6 భారతీయ సంస్థలపై తీవ్ర చర్యలకు దిగింది అమెరికా. భారత్‌కు చెందిన 6 ప్రముఖ కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నాయనే ఆరోపణల మధ్య ఈ ఆరు సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీని మొత్తం విలువ 220 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే (సుమారు రూ. 1800 కోట్లు. ఈ లావాదేవీలు ఇప్పుడు అమెరికా దర్యాప్తు పరిధిలోకి వచ్చాయి.

ఈటీ కథనం ప్రకారం.. ఈ కంపెనీలు 2024లో, 2025 ప్రారంభంలో ఇరాన్ నుండి మిథనాల్, టోలుయిన్, పాలిథిన్ వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఈ ఆరు కంపెనీలు దిగుమతి చేశాయి. ఈ దిగుమతులు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఆంక్షలు విధించబడిన భారతీయ సంస్థలు ఇవే.
1. ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (84 మిలియన్ డాలర్ల విలువైన ఇరానియన్ పెట్రోకెమికల్స్ దిగుమతుల ఆరోపణలు)
2. గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్ (51 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మిథనాల్)
3. జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ (టోలుయిన్ సహా 49 మిలియన్ డాలర్ల దిగుమతులు)
4. రామ్నిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ. ( మిథనాల్, టోలుయిన్ కలిపి 22 మిలియన్ డాలర్ల దిగుమతులు)
5. పెర్సిస్టెంట్ పెట్రోకెమికల్స్ (14 మిలియన్ డాలర్ల మిథనాల్)
6. కాంచన్ పాలిమర్స్ (1.3 మిలియన్ డాలర్ల పాలిథిన్ ఉత్పత్తులు)
ఈ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల US ఆధారిత ఆస్తులను స్తంభింపజేయడం, అమెరికన్ సంస్థలు వీరితో వ్యాపారం చేయకుండా నిషేధించడం వంటి పరిణామాలు తలెత్తనున్నాయి. అలాగే, ఈ సంస్థలలో 50 శాతానికి పైగా యాజమాన్యం ఉన్న ఇతర కంపెనీలపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఇరాన్ నుండి వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నదనే ఆరోపణలతో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇరాన్ అనుబంధ సంస్థలపై అమెరికా కఠినమైన నిఘా పెట్టింది.
ఈ పరిణామాలపై భారత వాణిజ్య శాఖ స్పందించింది. భారతప్రభుత్వం పరిణామాలను సమీక్షిస్తున్నదని.. అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. MSMEలు, రైతులు, పరిశ్రమల మనుగడను కాపాడతామని తెలిపింది. న్యాయమైన సమతుల్య వాణిజ్య ఒప్పందాల పట్ల భారతప్రభుత్వం వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుందని స్పష్టం చేసింది.
అగస్టు 1 నుంచి ట్రంప్ ప్రాధాన్యంగా భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది అమెరికా-భారత ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల ట్రంప్ సుంకాల నిర్ణయం తీసుకున్నారు.భారత్ అత్యధిక దిగుమతి సుంకాలు, కఠిన వాణిజ్య విధానాలు కొనసాగిస్తోందని ట్రంప్ విమర్శించారు.ఈ నిర్ణయం వల్ల భారత ఎగుమతులు ముఖ్యంగా దుస్తులు, ఔషధాలు, ఆభరణాలు, పెట్రోకెమికల్స్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024 నాటికి భారతదేశం అమెరికాకు 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!



Click it and Unblock the Notifications