ఎకానమీ క్రైసిస్: ఈ పండుగ సీజన్‌లో దారుణంగా పడిపోయిన ఇన్నర్‌వేర్ సేల్స్

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగ సీజన్‌లో దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా సేల్ అయ్యే వాటిల్లో ముఖ్యంగా దుస్తులు. ఫ్యాషన్ దుస్తుల సేల్స్ ఈ సీజన్లో కొంతలో కొంత బాగున్నాయట. కానీ అండర్‌వేర్ సెక్షన్ మాత్రం భారీగా పడిపోయిందట. పురుషులు, స్త్రీలు, చిన్నారులు అని తేడా లేకుండా అన్ని రకాల ఇన్నర్ వేర్ సేల్స్ పడిపోయాయట. లక్స్ కోజి, డాలర్, రూపా వంటి వివిధ కంపెనీల సేల్స్ సాధారణ స్థాయిలో కూడా లేవు. నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత అండర్ గార్మెంట్స్ సేల్స్ పడిపోయాయని, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి అని చెబుతున్నారు.

60 శాతం సేల్స్ అక్కడి నుంచే

60 శాతం సేల్స్ అక్కడి నుంచే

మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్స్ (MBOs)గా భావించే స్థానిక దుకాణాలు స్టాక్స్ కొనుగోలు చేయలేదట. అంతేకాదు, పేమెంట్స్ కూడా ఆలస్యం చేస్తున్నారట. ఈ ప్రభావం తయారీదారులపై పడుతోందని చెబుతున్నారు. భారతదేశంలో లక్షకు పైగాఎంబీవోలు ఉన్నాయని రీసెర్చ్ కంపెనీ ఎడల్వీస్ సెక్యూరిటీస్ తెలిపింది. లోదుస్తుల అమ్మకాల్లో ఇక్కడి నుంచి జరిగే సేల్స్ 60 శాతం ఉంటాయి. మిగతావి మాల్స్, ఆన్ లైన్ పోర్టల్ వంటి మోడర్న్ ట్రేడ్ ఫార్మాట్ ద్వారా జరుగుతున్నాయి.

2024 నాటికి రూ.68వేల కోట్లకు సేల్స్

2024 నాటికి రూ.68వేల కోట్లకు సేల్స్

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ టెక్నో‌పాక్ నివేదిక ప్రకారం అండర్‌వేర్ సేల్స్ 2014లో రూ.19,950 కోట్లు అయితే ఏటా 13 శాతం పెరిగి 2024 నాటికి రూ.68,270కు చేరుకుంటుందని అంచనా. ఫ్యాషన్ దుస్తులతో పాటు లోదుస్తుల సేల్స్ కూడా పెరుగుతాయని అంచనా. గత కొన్నాళ్లుగా కూడా ఈ సేల్స్ పెరుగుతున్నాయి కూడా.

పండుగ సీజన్ మందకోడి

పండుగ సీజన్ మందకోడి

గత ఆరు నెలలుగా ఈ పరిశ్రమలో డిమాండ్ తగ్గిందని రూపా మేనేజింగ్ డైరెక్టర్ కేబీ అగర్వాల్ అన్నారు. పడిపోతున్న అమ్మకాలతో పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, రియల్ ఎస్టేట్ నుంచి పార్లేజీ బిస్కట్ల వరకు సేల్స్ పడిపోయాయని, ప్రతి ఇండస్ట్రీ కూడా డిమాండ్ లేమితో ఇబ్బంది పడుతోందన్నారు. తమ సేల్స్ పది నుంచి పదిహేను శాతం తగ్గాయన్నారు. పండుగ సీజన్ చాలా మందకోడిగా ఉందన్నారు.

20 శాతానికి బదులు 10 శాతమే పెరిగాయి

20 శాతానికి బదులు 10 శాతమే పెరిగాయి

స్థానిక చిల్లర వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ఈ సీజన్లో తమ వద్ద సరుకు అంతా పోగుపడిందని, పండుగ సమయంలో అమ్మకాలు కొద్దిగానే పెరిగాయన్నారు. దసరా, దీపావళి పండుగ సమయంలో సాధారణంగా 20 శాతం సేల్స్ ఎక్కువగా ఉంటాయని, కానీ 10 శాతం మాత్రమే పెరిగాయన్నారు.

సేల్స్ దారుణంగా ఉన్నాయి

సేల్స్ దారుణంగా ఉన్నాయి

సేల్స్ డిమాండ్ చాలా ఘోరంగా ఉన్నాయని లక్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అశోక్ కుమార్ తోడి అన్నారు. పండగ సీజన్ ప్రారంభానికి ముందు సేల్స్ 40 శాతం తగ్గాయన్నారు. అంతకుముందు ఆరు నెలలతో పోలిస్తే 25 శాతం తగ్గాయన్నారు. తమ రంగంలో డిమాండ్ పెరిగేందుకు కేంద్రం ఉద్దీపన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఎకనామిక్ రీజన్లతో పాటు అతి తక్కువ వినియోగ డిమాండ్ కూడా కారణమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+