వాషింగ్టన్: అమెరికా - భారత్ వాణిజ్య సంబంధాలపై గత వారం భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు వేగవంతమయ్యాయని, త్వరలో ముగుస్తాయని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య చాలాకాలంగా ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా, శనివారం 34 మంది అమెరికా ప్రతినిధులు ఆ దేశ వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్‌కు లేఖ రాశారు.

భారత్‌తో వాణిజ్య గొడవతో మనకే నష్టం
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం జాప్యంపై వారు అసహనం వ్యక్తం చేశారు. భారత్‌తో వాణిజ్య విభేదాల వల్ల అమెరికా వ్యాపారస్థులకే నష్టం చేస్తోందని మరోసారి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై పడుతున్న భారం అమెరికా గ్రామీణ వ్యవస్థను కుంగదీస్తోందని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా పెకాన్ అనే ఉత్పత్తిపై భారత్ విధిస్తున్న అత్యధిక 36 శాతం టారిఫ్ అమెరికా గ్రామీణ ఉత్పత్తిదారులకు ఇబ్బందికరంగా మారిందని లేఖలో పేర్కొన్నారు.

భారత్ ఇటీవల వేగంగా ఎదుగుతోంది..
మధ్య తరగతి జనాభా అధికంగా ఉన్న, క్రమంగా పెరుగుతున్న ఈ జనాభా కారణంగా అమెరికా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, అమెరికాలో పండే వ్యవసాయ ఉత్పత్తులు, ట్రీ నట్స్‌కు భారత్‌లో డిమాండ్ క్రమంగా పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సభ్యుడు ఆస్టిన్ స్కాట్ నేతృత్వంలోని బృందం రాసిన లేఖలో పేర్కొన్నారు.

భారత్‌తో చర్చలు కొనసాగించండి..
భారత్ పట్ల అమెరికా చర్యలకు ప్రతిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ సుంకాలు విధిస్తోందని, ఈ ప్రభావం మన పైనే (అమెరికా) పడుతోందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలకు ధీటుగా మోడీ ప్రభుత్వం పెకాన్ ఎగుమతులపై అధికంగా 36 శాతం టారిఫ్ విధించిందని, ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న అడ్డు తొలగేలా చర్చలు కొనసాగించాలన్నారు.

భారత్ వల్ల అమెరికా గ్రామీణానికి లాభం.. జీఎస్పీ పునరుద్ధరించాలి
భారత్‌తో చర్చలు ముందుకు సాగితేనే ఆ దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి వినిమయం కారణంగా వారికి పెకాన్ అందుబాటులో ఉంటుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతులు పెంచుకుంటే అమెరికా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపారు. అంతేకాదు, ఇటీవల ట్రంప్ భారత్‌కు తొలగించిన జీఎస్పీ (ప్రత్యేక వాణిజ్య హోదా)ను పునరుద్ధరించే అంశంపై ఆలోచించాలన్నారు. లేదంటే అమెరికాకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వంతో ఈ అంశాలపై వాణిజ్య చర్చలో భాగంగా చర్చించాలన్నారు.

భారత్‌తో వద్దు... మనకే నష్టం
భారత్, చైనా వంటి దేశాలు టారిఫ్ రూపంలో అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందుతున్నాయని, ఇలాంటి వాటిని ఎంతో కాలం ఉండనీయజాలమని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. భారత్ ఉత్పత్తులపై టారిఫ్ విధించడంతో పాటు ప్రత్యేక హోదాను కూడా తొలగించారు. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ధీటుగా స్పందించింది. అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో భారత్ కంటే అమెరికా వారికే ఎక్కువ నష్టం జరుగుతోందని అమెరికన్ సెనేట్ సభ్యులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ గత నెలలోను ప్రజాప్రతినిధులు లేఖ అందించారు. భారత్‌తో వాణిజ్య సంక్లిష్టత అమెరికాకే నష్టమని వారు ట్రంప్ ప్రభుత్వానికి పదేపదే సూచిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications