మీకు ట్యాక్స్ రీఫండ్ చేస్తాం, మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాలని, సీవీసీ నెంబర్ చెప్పాలని, అలా చేస్తే మీ ట్యాక్స్ రీఫండ్ మొత్తం మీ అకౌంట్లో జమ అవుతుందని కొన్ని లింక్స్ సందేశాలు మీకు వస్తుంటాయి. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాంటి ఎస్సెమ్మెస్‌లు లేదా ఈ-మెయిల్స్ వస్తే వెంటనే మీ వివరాలు ఇవ్వవద్దని చెబుతున్నారు.
వారు అడిగిన వివరాలు మీరు ఇస్తే కనుక మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు వారు ఊడ్చేస్తారు. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు ఈ పంథాను ఎంచుకున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ అధికారులు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.

సొమ్ము కాజేస్తారు
అలాంటి సైబర్ నేరగాళ్లను నమ్మి మీ వివరాలు ఇస్తే కష్టపడి సంపాదించిన మీ సొమ్మును దొంగిలిస్తారని హెచ్చరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇలాంటి వివరాలు కోరుతూ సందేశాలు లేదా ఈ-మెయిల్స్ రావను గుర్తుంచుకోవాలని సూచించింది. మారుతున్న హైటెక్ ప్రపంచంలో అందుకు అనుగుణంగా నేరగాళ్లు కొత్త కొత్త దార్లు వెతుకుతున్నారు.

ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్త
ఐటీ శాఖ పంపిస్తున్నట్లుగా ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని, ట్యాక్స్ రీఫండ్ ప్రక్రియలో భాగంగా మేము మీ డెబిట్, క్రెడిట్ కార్డు, సీవీసీ నెంబర్లు అడగమని, మీ కార్డు వివరాలు ఎవరితోను పంచుకోవద్దని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.

నమ్మి వివరాలు అందిస్తే..
ట్యాక్స్ రీఫండ్ కోసం కొంతమంది వాటిని నమ్మి వివరాలు అందిస్తే మీ డబ్బు పోతుందని హెచ్చరించారు. రీఫండ్ ప్రక్రియ కోసం కేవలం బ్యాంకు వివరాలు ఉంటే చాలునని, డెబిట్ కార్డు వివరాలు అవసరం లేదని, ఇలాంటి నకిలీ సందేశాలు నమ్మవద్దని సూచించింది.

ట్యాక్స్ రీఫండ్ ఫ్రాడ్ సందేశం
అమాయక ట్యాక్స్ పేయర్స్‌ను బుట్టలో పడేసేందుకు నమ్మదగిన విధంగా సైబర్ నేరగాళ్లు ప్రవర్తిస్తారు. ఐటీ రిటర్న్స్‌ను లాస్ట్ తేదీలోగా దాఖలు చేయాలని ముందుగా నమ్మబలుకుతారు. ఐటీఆర్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోమని సందేశాలు కూడా వస్తాయి. ఈ ఈ-మెయిల్స్, సందేశాలు మిమ్మల్ని మెప్పించేలా ఉంటాయి. వాటితో పాటు కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయమని ఉంటుంది.

కొత్త వెబ్ సైట్‌కు వెళ్లి వివరాలు అడుగుతుంది
మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఓ కొత్త వెబ్ సైట్‌కు వెళ్తుంది. అందులో మీ నుంచి వివరాలు కోరుతూ ఓ ఫారమ్ ఉంటుంది. బ్యాంకు అకౌంట్ వివరాలతో పాటు ఆధార్ కార్డు నెంబర్, మీ పాన్ కార్డు నెంబర్ అడుగుతారు. కానీ ఇవి మీ సీక్రెట్ వివరాలు. ఈ వివరాలు మీరు ఎవరికి కూడా అందించవద్దు. ఎందుకంటే ఐటీ రిటర్న్స్ రీఫండ్ చేస్తామనే సాకుతో సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకులోని డబ్బును గుల్ల చేస్తారు.

ఇతరులకు విక్రయించే అవకాశం
మీ రహస్య సమాచారం ఇస్తే మీరు నష్టపోతారు. అంతేకాదు, దానిని ఇతరులకు అమ్మివేయవచ్చు కూడా. ఆ తర్వాత ఇతర సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. కాబట్టి అలర్ట్‌గా ఉండాలి.

అలాంటి వారికి దూరంగా ఉండండి..
నిపుణుల అభిప్రాయం మేరకు... ఐటీఆర్ రీఫండ్ గురించి ఆందోళన చెందేవారు, సోషల్ మీడియాలో సంబంధిత సమాచారం గురించి పదేపదే వెతికేవారు తదితరులు ఎక్కువగా ఇలాంటి ఫేక్ అలర్ట్స్‌కు పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ ద్వారా మీ వివరాలు అడిగితే మీరు అనుమానించాల్సిందే. మీ పర్సనల్ వివరాలను ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు లేదా ఈ మెయిల్స్ ద్వారా అడిగేది కేవలం ఫ్రాడ్ చేసేవాళ్లే. ఐటీ డిపార్టుమెంట్ మాత్రం అలాంటి పర్సనల్ వివరాలు అడగదు. మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ బ్యాంకులో లేదా ట్యాక్స్ అథారిటీలను అడగండి. మీకు రీఫండ్ అవుతుందని లేదా మీ బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగే వారికి దూరంగా ఉండండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications