ఆర్టీసీ-ప్రైవేటు లాభాలు, నష్టాల లెక్క ఇదీ: మోడీ ఆయుధంతో కేసీఆర్ చెక్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీది దాదాపు ముగిసిన చరిత్రేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం షాకింగ్ ప్రకటన చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా ఆర్టీసీని కాపాడలేరన్నారు. ఇక ఆర్టీసీని మరిచి పోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాపాడే శక్తి తన చేతుల్లోను లేదని, ఎవరూ కాపాడలేరని, పాత ఆర్టీసీ ఉండే అవకాశమే లేదన్నారు. అలాగే, సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదని, చిల్లర రాజకీయాలతో కార్మిక సంఘాలు సంస్థ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. ఈ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేక చేతులెత్తేస్తోందన్నారు. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెరిగాయి

ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెరిగాయి

దేశంలో ఎక్కడా లేనివిధంగా నాలుగేళ్లలోపే ఆర్టీసీ కార్మికులకు 67 శాతం శాలరీలు పెంచినట్లు కేసీఆర్ తెలిపారు. కార్మికులు ఎవరైనా ఆర్టీసీలో పని చేయాలనుకుంటే డిపోల వద్దకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వారిని తీసుకున్నా పరిస్థితి మారదని, ఏం జరుగుతుందనేది త్వరలో బయటపడుతుందని చెప్పారు. సమ్మె ఒక పిచ్చి పని అని, బుద్ధి జ్ఞానం లేనిది, చట్ట వ్యతిరేకం అన్నారు. ఇప్పటికే ఎస్మా చట్టం అమల్లో ఉందని, ఎవరు సమ్మె చేసినా ఇలాంటి చర్యలే అన్నారు. ఆర్టీసీ విలీనంపై ఏపీలో ప్రయోగం చేశారని, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడలేమన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు.

రూ.5,000 కోట్ల అఫ్పులు.. అద్దె బస్సులతో లాభం..

రూ.5,000 కోట్ల అఫ్పులు.. అద్దె బస్సులతో లాభం..

ఆర్థిక మాంద్యం అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ను తగ్గించామని, ఆర్టీసికి రూ.5,000 కోట్ల అప్పులు ఉన్నాయని, ఇది కాకుండా నెలకు రూ.100 కోట్ల చొప్పున నష్టం వస్తోందని చెప్పారు. అద్దె బస్సులు లాభాల్లో నడుస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సులు మాత్రం నష్టాల్లో ఉన్నాయని, కిలో మీటరుకు రూ.13 నష్టం వస్తోందని తెలిపారు. నెలకు రూ.1200 కోట్లు నష్టం వస్తోందన్నారు. అద్దె బస్సుల మీద కిలోమీటరుకు 75 పైసలు లాభం వస్తోందని, ఆర్టీసీ బస్సుకు ప్రతి కిలోమీటరుకు రూ.13 నష్టం వస్తోందన్నారు. అద్దె బస్సుల మీద రోజుకు రూ.4.72 లక్షల లాభం వస్తోందని, ఆర్టీసీ బస్సుల మీద రూ.3 కోట్ల నష్టం వస్తోందన్నారు.

ఆర్టీసీలో 2100 అద్దె బస్సులు, 8 వేల సొంత బస్సులు ఉన్నాయన్నారు.

ప్రయివేటు లాభం, ఆర్టీసీ నష్టం.. ఎందుకు

ప్రయివేటు లాభం, ఆర్టీసీ నష్టం.. ఎందుకు

అసలు ప్రయివేటు ట్రావెల్స్ లాభాల్లో ఉంటే, ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాదులో కేశినేని, గంగినేని, జబ్బార్, దివాకర్ వంటి బస్సులు ఎలా నడుస్తున్నాయన్నారు. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ కోసం బడ్జెట్‌లో రూ.712 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం అయిదేళ్లలో రూ.4,250 కోట్లు ఇచ్చిందన్నారు. గత బడ్జెట్‌లో రూ.550 కోట్లు కేటాయించామన్నారు. కాలం చెల్లిన 2600 బస్సులకు బదులు కొత్తవి కొనాలంటే రూ.1000 కోట్లు కావాలన్నారు.

అదనపు ఆదాయం వచ్చే పండుగ సమయంలో..

అదనపు ఆదాయం వచ్చే పండుగ సమయంలో..

ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చే పండుగ సమయంలో సమ్మె చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వద్ద రూపాయి లేదని, సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని కోర్టులో కేసు వేశారని, ఇవ్వకపోతే హైకోర్టు ఏమైనా కొడుతుందా అన్నారు. పీఎఫ్ డబ్బులు ప్రభుత్వం వాడుకుందని కోర్టుకు అబద్దాలు చెబుతున్నారన్నారు. జీతాలు ఇవ్వాలంటే నాలుగు బస్టాండ్లు అమ్మాల్సిందే అన్నారు. తమ దగ్గర జీతాలు లేవని, ఆర్టీసీ కార్మికులకు సగటున రూ.50,000 జీతం ఉందని చెప్పారు.

రూ.150 కోట్లు రాకుండా చేశారు..

రూ.150 కోట్లు రాకుండా చేశారు..

ఆర్టీసీకి మామూలు రోజుల్లో రోజుకు రూ.11 కోట్లు ఆదాయం వస్తే పండుగ సమయంలో రోజుకు రూ.16-17 కోట్ల వరకు వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి సమయంలో కార్మికులు సమ్మెకు పోయారని, దాదాపు రూ.125-150 కోట్లు రాకుండా చేశారన్నారు. ఆర్టీసీకి రూ.60వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారని, ఎక్కడ ఉన్నారో చూపించాలన్నారు.

బెంగాల్లో 200 బస్సులే

బెంగాల్లో 200 బస్సులే

తాను గతంలో రవాణామంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సంస్థ రూ.13.80 కోట్ల నష్టంలో ఉందని, ఎంతో ఆలోచన చేసి ఏడాదిన్నరలో నష్టాన్ని పూడ్చి, మరో రూ.14 కోట్ల లాభంలోకి తీసుకు వచ్చామని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీపై తనకున్నంత లోతైన అవగాహన, సానుభూతి ఇంకొకరికి లేదన్నారు. తాను సీఎం అయిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమై, ఎలా ముందుకు వెళ్తే ఆర్టీసీ బాగుపడుతుందో సలహాలు ఇచ్చానని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదని, బెంగాల్లో 10 కోట్ల జనాభా ఉంటే 200 బస్సులో ఉన్నాయన్నారు.

మోడీ తెచ్చిన చట్టం.. కేసీఆర్ ఆయుధాం

మోడీ తెచ్చిన చట్టం.. కేసీఆర్ ఆయుధాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త మోటార్ వాహన సవరణ చట్టం తీసుకు వచ్చిందని, అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చిందని, ఇకపై ఆర్టీసీ ఆధిపత్యం ఉండదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రయివేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవచ్చునని చెప్పారు. దీంతో సేవలు మెరుగుపడి, ఛార్జీలు తగ్గుతాయన్నారు. ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిట్లు ఇస్తామన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+