రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త, మద్దతు ధర ఏ పంటకు ఎంత అంటే?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. కేంద్ర కేబినెట్ బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రైతులు ఆనందించే వార్తను అందించింది. కొన్ని కీలకమైన పంటలకు కనీస మద్దతు ధరను (MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చే కొన్ని పంటలకు ఇవి వర్తిస్తాయి.
దీని వల్ల రైతులకు ఉత్పత్తి వ్యయం కంటే దాదాపు 50 శాతం అధికంగా లభిస్తుంది. గోధుమ, బార్లీ పంటలపై క్వింటాల్‌కు రూ.85, వేరుశనగకు రూ.255 పెంచింది. మసూరీ పప్పుపై రూ.325, ఆవాలపై రూ.225, కుసుమలపై రూ.270 రూపాయలు పెంచింది.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోధుమల ధర క్వింటాల్‌కు రూ.1840గా ఉంది. రూ.85 పెరిగి ఇది రూ.1925 అవుతుంది. బార్లీ ధర ప్రస్తుతం రూ.1440 ఉండగా రూ.1525కు పెరుగుతుంది.
పప్పులు క్వింటాల్‌కు రూ.325 పెరిగి రూ.4800కు పెరుగుతుంది. సన్‌ఫ్లవర్ రూ.270 పెరిగి రూ.5215, గ్రామ్ కంది రూ.255 పెరిగి రూ.4875 అవుతుంది. అవాల వంటి వాటికి రూ.225 పెరిగి రూ.4,200 నుంచి రూ.4425కు పెరిగింది.
మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ధరను ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు మోడీ ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రులు చెబుతున్నారు. ఇందులో భాగంగా పీఎం-కిసాన్ యోజన స్కీం కింద పెట్టుబడి సాయం అందివ్వడంతో పాటు ఇప్పుడు మద్దతు ధర పెంచారు.


Click it and Unblock the Notifications