గుడ్‌న్యూస్: బీఎస్ఎన్ఎల్ మూసివేయట్లేదు, VRS ప్యాకేజీ ఎంత అంటే?

న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థలను విలీనం చేయాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను మూసివేస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. దీంతో ఉద్యోగులు, జనాల్లో ఆందోళన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ అన్ని అంశాలపై స్పష్టతను ఇచ్చారు.

మూసివేయడం లేదంటూ శుభవార్త

మూసివేయడం లేదంటూ శుభవార్త

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను మూసివేయడం లేదా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అందులో నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ సంస్థలను విక్రయించడం, ప్రయివేటీకరించడం, మూడో పక్షానికి అప్పగించడం వంటివి చేయడం లేదన్నారు. మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని పోటీలో నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను విలీనం చేస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎస్ఎన్ఎల్‌కు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థగా ఉంటుందన్నారు. ఎంటీఎన్ఎల్ వాటాలను ఆఫ్ లోడ్ చేసిన తర్వాత విలీనం పూర్తవుతుందన్నారు.

పునరుద్ధరణకు రూ.68 వేల కోట్లు

పునరుద్ధరణకు రూ.68 వేల కోట్లు

వేల కోట్లతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్ని పునరుద్ధరిస్తున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. రానున్న నాలుగేళ్లలో బాండ్స్ ద్వారా రూ.15వేల కోట్లు సమీకరిస్తామని, రూ.38,000 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రూ.29,937 కోట్లతో వీఆర్ఎస్ స్కీం ఉంటుందన్నారు. మొత్తంగా పునరుద్ధరణకు రూ.68 వేల కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఖర్చులు తగ్గించుకునే దిశలోను యోచిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు 4G స్పెక్ట్రం కేటాయిస్తామని తెలిపారు.

వీఆర్ఎస్ పథకం

వీఆర్ఎస్ పథకం

ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఆకర్షణీయమైన వాలంటరీ రిటైర్మెంట్ సదుపాయం కల్పించనున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఈ రెండు సంస్థల్లో 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పథకానికి రూ.39,937 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. పెన్షన్, గ్రాటిట్యుటీ, కమ్యూటేషన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.

ఎవరు వీఆర్ఎస్ తీసుకుంటే ఎంత శాతం?

ఎవరు వీఆర్ఎస్ తీసుకుంటే ఎంత శాతం?

వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు నష్టం జరగకుండా నిబంధనలు రూపొందించారు. ఉదాహరణకు 53 ఏళ్ళకు పైబడిన ఉద్యోగి వీఆర్ఎస్ తీసుకుంటే 60 ఏళ్లు వచ్చే వరకు 125 శాతం చొప్పున జీతంతో పాటు పెన్షన్, గ్రాట్యిట్యుటీ దక్కేలా ప్యాకేజీ రూపొందించారు. అదే 50 ఏళ్ల నుంచి యాభై మూడున్నరేళ్ల లోపు వయస్సు వారేతే 80 శాతం నుంచి 100 శాతంగా ఉంటుంది. వీఆర్ఎస్ పూర్తి స్వచ్చంధం. ఎవరిపైనా ఒత్తిడి ఉండదు. వీఆర్ఎస్ గడువు 31 జనవరి 2020.

2016 నాటి ధరకే 4జీ స్పెక్ట్రం

2016 నాటి ధరకే 4జీ స్పెక్ట్రం

పోటీలో నిలబడేందుకు బీఎస్ఎన్ఎల్‌కు 2016 నాటి ధరలకే 4G స్పెక్ట్రం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీని మీద చెల్లించాల్సిన రూ.4,000 కోట్ల జీఎస్టీని ప్రభుత్వమే బడ్జెట్ ద్వారా ఇస్తుందన్నారు. సంస్థ పునరుద్ధరణకు బాండ్స్ ద్వారా పదిహేనువేల కోట్ల రూపాయల తక్షణ రుణం సమీకరిస్తామన్నారు. దీనిని బీఎస్ఎన్ఎల్ తిరిగి చెల్లిస్తుందన్నారు.

ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్‌కు ఇది ప్లస్

ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్‌కు ఇది ప్లస్

ఈ రెండు సంస్థలకు రూ. 40,000 కోట్ల అప్పుల భారం ఉంది. ఇందులో సగం అప్పులు కేవలం ముంబై, ఢిల్లీ సర్కిల్స్ టెలికాం సేవలు అందిస్తున్న ఎంటీఎన్‌ఎల్‌వి. ప్రయివేటు కంపెనీలతో పోలిస్తే ఈ రెండు కంపెనీల అప్పుల భారం తక్కువ. అప్పులు తక్కువగా ఉండడంతో పాటు ఈ 2 కంపెనీలకు స్థిరాస్తులు కూడా ఎక్కువ. దీంతో ఈ ఆస్తులను హామీగా చూపి విస్తరణకు అవసరమైన పెట్టుబడులను బ్యాంకు ల నుంచి రుణాలుగా సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్యాకేజీతో లాభాల్లోకి...

ప్యాకేజీతో లాభాల్లోకి...

రుణాల చెల్లింపు, నెట్ వర్క్ ఆధునికీకరణ, విస్తరణ, నిర్వహణ ఖర్చుల కోసం వచ్చే నాలుగేళ్లలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ భూములు, అద్దెలు, లీజులు తదితరాల రూపంలో రూ.37,500 కోట్లు సమీకరిస్తారు. వివిధ రకాల ప్యాకేజీలతో ఈ సంస్థలు రెండు మూడేళ్లలో లాభాల్లోకి వస్తాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+