ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరంలో గత త్రైమాసికంలో వృద్ధిరేటు 5.8శాతానికి పడిపోయింది. అయితే ఇదే సమయంలో 2019 క్యాలెండర్ ఇయర్లో హౌస్ హోల్డ్ ఆదాయం లేదా వ్యక్తుల ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ఈ మేరకు స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ నివేదిక సోమవారం వెల్లడించింది. హౌస్ హోల్డ్ సంపద రెండింతలు పెరిగి 12.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2018లో ఇది 5.972 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. మన రూపాయల్లో చెప్పాలంటే 2018లో సంపద 418 లక్షల కోట్లు (5.972 ట్రిలియన్ డాలర్లు) ఉండగా, 2019లో రూ.882 లక్షల కోట్లకు (12.6 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ఇంతలా పెరగడానికి గల కారణాలు వెల్లడించలేదు.

సంపద లేక కాదు... కొనుగోళ్ల సామర్థ్యం పెరగక...
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఇటీవల కార్పోరేట్ పన్నును తగ్గించింది. ఈ క్రమంలో తాజా నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో సంపద లేక కాదని, వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరగక పోవడం వల్లే మందగమనం అనే ఆర్థిక నిపుణుల వాదనకు బలం చేకూరుతోంది.

బంగారం, భూములు, స్థిరాస్థిలోనే ఎక్కువ...
ఈ నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య హౌస్ హోల్డ్ సంపద నాలుగు రెట్లు పెరిగింది. రానున్న అయిదేళ్లలో మరో 43 శాతం లేదా 4.4 ట్రిలియన్ డాలర్ల మేర పెరగవచ్చు. పెరిగిన సంపదలో బంగారం, భూములు, ఇళ్లు వంటి స్థిరాస్థి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. అయితే 2016లో నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి కాస్త మందగించింది.

ఒక్కొక్కరి వద్ద రూ.10.5 లక్షల సంపద
దేశంలో ఒక్కో వ్యక్తి సంపద 3.3 శాతం పెరిగింది. అంటే 14,569 డాలర్లు లేదా రూ.10.5 లక్షలకు పైగా సంపద నమోదయింది. అదే సమయంలో మొత్తం అప్పులు 11.5 శాతం పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెరిగిన వాటిలో ఆర్థిక ఆస్తులు 1.4 శాతం, ఆర్థికేతర ఆస్తులు 6.9 శాతం ఉన్నాయి.

కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో భారత్
అంతర్జాతీయంగా చూస్తే... 8.27 లక్షల మంది వద్దే ప్రపంచ సంపదలోని 1.6 శాతం ఉందని ఈ నివేదిక తెలిపింది. దాదాపు 4,500 మంది వద్ద 50 మిలియన్ డాలర్లకు (రూ.350 కోట్లు) పైగా, 1,790 మంది వద్ద 100 మిలియన్ డాలర్లకు (రూ.700 కోట్లకు పైగా) పైగా సంపద ఉన్నట్లు పేర్కొంది. అధిక నికర సంపద కలిగిన వ్యక్తుల సంఖ్యలో భారత్ అయిదవ స్థానంలో ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications