ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు (PMC) ఫ్రాడ్ కారణంగా వేలాది మంది తమ డబ్బును కోల్పోయారు. ఈ బ్యాంకులో లక్షలాది రూపాయలు పెట్టిన ముగ్గురు నలుగురు కస్టమర్లు మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. పీఎంసీ బ్యాంకులో డబ్బులు పెట్టిన ఓ వ్యక్తి తన సర్జరీకి డబ్బులు లేక చనిపోవడం బాధాకరం. పీఎంసీ ఫ్రాడ్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై కస్టమర్లకు ఊరటనిచ్చేలా ప్రచారంలో మాట్లాడారు.
ఇదిలా ఉండగా, పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులో తమ సొమ్ము ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు చేతికి అందని దుస్థితి. లక్షలాదిమంది కస్టమర్లది ఇదే పరిస్థితి. పీఎంసీ బ్యాంక్ స్కాం నేపథ్యంలో ఆర్బీఐ ఆంక్షలు తెచ్చింది. ఈ ఆంక్షలు అమలులోకి వచ్చి దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఈ ఆంక్షలు కూడా కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

73 ఏళ్ల శశి కుమార్ నియోటియా ఈ మధ్య గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. తన కిడ్నీల్లో ఒకటి కూతురుకు దానం ఇచ్చారు. ఈయన తన డబ్బు మొత్తాన్ని పీఎంసీ బ్యాంక్‌లోనే పెట్టారు. కానీ ఇప్పుడు కనీస వైద్య అవసరాలకు వాటిని తీసుకోలేని స్థితిలో ఉన్నామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
పీఎంసీ బ్యాంక్‌ను 1984లో స్థాపించారు. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఈ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 137 శాఖలు ఉన్నాయి. దేశంలోని టాప్ 10 సహకార బ్యాంకుల్లో పీఎంసీ ఒకటి. ముంబై ప్రధాన కేంద్రంగా నడుస్తోంది. ఈ బ్యాంకులో దాదాపు రూ.11 వేల కోట్ల డిపాజిట్లున్నాయి. సుమారు 10 లక్షల ఖాతాదారులు ఉన్నారు.
నిర్మాణ రంగ సంస్థ హెచ్‌డీఐఎల్‌తో పీఎంసీ బ్యాంకు పెద్దలు కుమ్మక్కు అయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాఫ్తు జరుగుతోంది. ఈ ఫ్రాడ్ వల్ల గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ.4,355.46 కోట్ల నష్టం వాటిల్లిందట. పీఎంసీ నుంచి హెచ్‌డీఐఎల్, ఆ గ్రూప్ సంస్థలు రుణాలను పొందాయి. ఈ సంక్షోభానికి మూల కారణమైన హెడీఐఎల్.. బ్యాంకుకు రూ.6,500 కోట్లు బకాయి పడింది. మొత్తం రూ.8,880 కోట్ల బ్యాంక్ రుణాల్లో ఇది 73 శాతం.
ఈ కేసులో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లతో పాటు బ్యాంకు మాజీ చైర్మన్, ఎండీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ... హెచ్‌డీఐఎల్‌కు చెందిన ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2018-19) బ్యాంకు మొండి బకాయిలు రెండింతలకు పైగా పెరిగాయని ఆర్బీఐ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘన, నియంత్రణ లోపాల దృష్ట్యా బ్యాంకుపై గత నెల 24న ఆంక్షలు విధించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications