ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రానున్న రెండేళ్లలో 200 బిలియన్ డాలర్ల (రూ.14,00,000 కోట్లు) సంస్థగా అవతరించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ మెరిల్‌లించ్ అంచనా వేసింది. 14 లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరిస్తే... భారత్ నుంచి ఇదే తొలి కంపెనీ అవుతుంది. RIL భవిష్యత్తుపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు అత్యంత ఆశాభావంతో ఉన్నాయి. రానున్న రెండేళ్లలో RIL మార్కెట్ క్యాప్ 200 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేసింది.

రూ.14.20 లక్షల కోట్లకు సమానం..
బ్యాంక్ ఆఫ్ మెరిల్‌లించ్ వేసిన ప్రస్తుత మారకం రేటు ప్రకారం 200 బిలియన్ డాలర్లు దాదాపు రూ.14.20 లక్షల కోట్లకు సమానం. ప్రస్తుతం RIL షేర్ల మార్కెట్ క్యాప్ 122 బిలియన్ డాలర్లుగా (రూ.8,54,000 కోట్లు) ఉంది. కంపెనీ రిటైల్, టెలికాం, బ్రాడ్ బ్యాండ్ వ్యాపారాలు ఇందుకు దోహదం చేస్తాయని అంచనా వేశారు. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త వ్యాపారాలన్నీ 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి లాభాలు ఆర్జించే దశకు చేరుకుంటాయని పేర్కొంది. అదే సమయంలో బుల్ మార్కెట్ దూసుకెళ్తే RIL షేర్లకు కలిసి వస్తాయని తెలిపింది.

మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్...
అసంఘటిత రిటైల్ మార్కెట్లో ఉన్న కిరణా దుకాణాలను బలోపేతం చేసేందుకు మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ (MPOS)లను అందించే వాణిజ్య చొరవను RIL తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఎంఎస్ఈ రంగంలోకి అడుగు పెడుతోంది. అలాగే జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ వ్యాపారం, ప్రకటనల వంటి డిజిటల్ కార్యక్రమాల వైపు అడుగులు వేస్తోంది. ఇవన్నీ ఎం-క్యాప్ పెంచుతాయి.

RIL ఆదాయం ఎలా పెరుగుతుందంటే...
బుల్ మార్కెట్ బాగుంటే 2021-22 నాటికి జియో ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.151 నుంచి రూ.177కు చేరుతుంది. MOPSలను అందించినందుకు 10 మిలియన్ కిరాణా దుకాణాలను నెలకు రూ.750 కోట్లు RILకు చెల్లిస్తాయి. బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు 2022 నాటికి 12 మిలియన్లకు చేరుకుంటారని అంచనా. వారిలో 60 శాతం మంది సరాసరిన నెలకు రూ.840 కోట్లు చెల్లిస్తారని అంచనా. SMEలు నెలకు రూ.2,000 చెల్లించవచ్చు. వీటిని పరిగణలోకి తీసుకుంటే వచ్చే 24 నెలల్లో RIL 200 బిలియన్ డాలర్ల కంపెనీకా అవతరించనుందని మెరిల్ లించ్ అభిప్రాయపడింది. అలాగే, వచ్చే రెండేళ్ల వరకు జియోపై పెట్టుబడులు అవసరం లేదు. టెలికం టారిఫ్స్ పెరగనున్నాయి. వీటి ద్వారా ఆదాయం రానుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications