ఒక వైపు డిజిటల్ వ్యాలెట్లు, మరోవైపు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంకోవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికి దేశంలో కరెన్సీ వినియోగం మాత్రం తగ్గడం లేదు. కరెన్సీ చలామణి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇందుకు తాజా గణాంకాలే నిదర్శనం. అక్టోబర్ 4 తో ముగిసిన వారానికి దేశంలో కరెన్సీ చలామణి రూ.19,699 కోట్లు పెరిగి రూ.22 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లలో వృద్ధి వృద్ధి రూ.69,077 కోట్లు దాటింది. ఇది 3.2 శాతం వృద్ధికి సమానం.
ఇంతకు ముందు జూన్ 7తో ముగిసిన వారంలో కరెన్సీ వినియోగం రూ.22,272కోట్లు పెరిగింది. మే 17, జూన్ 14 తో ముగిసిన వారాల్లో చలామణిలో ఉన్న కరెన్సీకన్నా తక్కువ గానే ఉంది. ఇంతకు ముందు జూన్ లో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ . 22,19,853 కోట్లుగా ఉంది. పెద్ద నోట్లు రద్దయిన మూడేళ్ళ తర్వాత నగదు మళ్ళీ ఈ స్థాయికి మొదటి సారి చేరుకుంది.

దీపావళి వస్తున్నవేళ
సాధారణంగా దీపావళికి ముందు వారాల్లో కరెన్సీ వినియోగం పెరుగుతుంది. ఈ పండగ సందర్భంగా వినియోగం పుంజుకుంటుంది. వినియోగదారులు అనేక రకాల ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా అనేక మంది నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తుంటారు. ఈసారి దీపావళి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా వస్తోంది. కాబట్టి కొనుగోళ్లు, నగదు వినియోగం మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

పీఎంసీ బ్యాంక్ ప్రభావం
పంజాబ్, మహారాష్త్ర కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ ) సంక్షోభం నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళనలు పెరిగిపోయాయి. విశ్వాసం సన్నగిల్లింది. పీఎంసీ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి తీసుకునే నగదుపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఇతర బ్యాంకుల ఖాతాదారులు కాస్త అప్రమత్తమై తమ నగదును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో నగదు చెలామణి పెరిగే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.

అయినా తక్కువేనట...
రూ.500, రూ.1,000 రద్దుకన్నా పూర్వం దేశ జీడీపీలో చలామణిలో ఉన్న కరెన్సీ 11.6 శాతం ఉండేది. ఇప్పుడు కరెన్సీ చలామణి పెరిగిపోయినప్పటికీ పెద్ద నోట్ల రద్దుకన్నా ముందు ఉన్న స్థాయికన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు భారత రిజర్వ్ బ్యాంకు అధికారవర్గాలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది తగ్గుతుంది...
ప్రస్తుతం కరెన్సీ వినియోగం ఎక్కువ ఉన్నప్పటికీ వచ్చే ఏడాదిలో తగ్గడానికి అవకాశం ఉందని బ్యాంకర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ వసూళ్లు నగదు రూపంలో జరుగుతున్నాయి. అయితే ఈ వసూళ్లను క్రమంగా ఎలక్ట్రానిక్ చెల్లింపులలోకి మార్చుతున్నారు. దీని వల్ల నగదు వినియోగం మరింతగా తగ్గుతుందని బ్యాంకర్లు అంటున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications