న్యూఢిల్లీ/కౌలాలంపూర్: జమ్ము కాశ్మీర్ అంశంలో భారత్ పైన మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్ విషం కక్కిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన దేశాల్లో చైనా, టర్కీ, మలేషియా మాత్రమే ఉన్నాయి. కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించిందని, ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించిందని ఐక్య రాజ్య సమితిలో మలేషియా ప్రధాని అర్థరహితంగా, అవగాహనారాహిత్యంతో మాట్లాడారు. దీనికి భారత్ ధీటుగా స్పందించింది. తాజాగా, భారత్ మలేషియాకు మరో షాకిచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్‌పై ఇష్టారీతిన మలేషియా ప్రధాని మాట్లాడటంతో పామాయిల్ దిగుమతులు తగ్గించింది. దీంతో కొనుగోలుదారులు (ఇండియా) తమ చూపును ఇండోనేషియా వైపు మరల్చారు.

మలేషియా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి
మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. పామాయిల్ సరఫరాలో మలేషియా కూడా ముందుంది. కాశ్మీర్ విషయంలో మలేషియా ప్రధాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్న భారతీయ పామాయిల్ బయ్యర్స్ తమ కొనుగోళ్లను మలేషియా నుంచి ఇండోనేషియాకు మరల్చడం ప్రారంభించారు. మలేషియా నుంచి వెజ్‌టేబుల్ ఆయిల్ కొనుగోలుపై మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే సుంకం.. మరింతగా పెంచే ఛాన్స్
మలేషియా నుంచి పామాయిల్ దిగుమతిని గణనీయంగా తగ్గించారు. దీంతో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో అక్కడి నుంచి భారత్ దిగుమతి అయ్యే పామాయిల్ మూడో వంతుకు పడిపోయింది. స్వాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఇండియా (SEA) మంగళవారం ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటికే మలేషియా నుంచి దిగుమతి అయ్యే శుద్ధి చేసిన పామాయిల్‌పై మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని అయిదు శాతం పెంచింది. మలేషియా పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని మోడీ ప్రభుత్వం మరింతగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇలా.. భారత్ అసంతృప్తి మొదటిసారి
ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతో పాటు ఉక్రెయిన్ నుంచి ఎడిబుల్ ఆయిల్ సరఫరాలు పెంచుకోవడం ద్వారా మలేషియా నుంచి వచ్చే దిగుమతులకు ప్రత్యామ్నాయంగా భర్తీ చేయవచ్చునని కట్స్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హెడ్ బిపుల్ ఛటర్జీ అన్నారు. రాజకీయ ప్రకటన మీద తమ వాణిజ్య భాగస్వామిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి అన్నారు.

దేశాల మధ్య విభేదాలు..
రీజినల్ డిప్లమటిక్ డిస్ప్యూట్ ప్రభావం ఇటీవల వాణిజ్యంపై పడుతోంది. కొరియన్ పెనున్సిలా ప్రాంతంపై ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణ కొరియా, జపాన్ మధ్య విభేదాలు కఠిన ఎగుమతుల తనిఖీలకు కారణమయ్యాయి. పర్యాటక రంగం దెబ్బతిన్నది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధ భయాలో ప్రపంచ మార్కెట్ల అస్థిరతకు కారణమయ్యాయి. చైనా, అమెరికాలు తరుచూ వాణిజ్య సంబంధాలను అధికార సాధనాలుగా వినియోగిస్తాయని ఛటర్జీ అన్నారు.

భారత్ ప్రధాన కొనుగోలుదారు
మలేషియా నుంచి భారత్ పామాయిల్ కొనుగోళ్లు నిలిపివేసే ఏ చర్య అయినా సౌత్ ఈస్ట్ ఏసియన్ దేశాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. మలేషియా అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి పామ్. అదే సమయంలో భారత్ అతిపెద్ద కొనుగోలుదారు. ఇండియా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 3.9 మిలియన్ టన్నుల పామాయిల్ కొనుగోలు చేసింది. దీని విలువ 2 బిలియన్ డాలర్లు. ఇది గత ఏడాది కంటే రెండింతలు. మలేషియా ప్రధాని అనాలోచిత వ్యాఖ్యలు భారత ప్రజల ఆగ్రగాన్ని చవిచూశాయి. నాడు ట్విట్టర్ ట్రెండింగ్‌లో మలేషియాకు వెళ్లవద్దని ఉంది. అలాగే, ఆ దేశంతో వాణిజ్యం వద్దని కూడా ట్రెండ్ అయింది.

అలా అయితే దౌత్యపరంగా వెళ్తాం...
పామాయిల్ దిగుమతి తగ్గింపుపై మలేషియా ప్రధాని మహతిర్ స్పందిస్తూ... ఇది వ్యాపారుల నుంచి (భారత వ్యాపారులు) వచ్చిన నిర్ణయం కాబట్టి తాము స్పందించలేమన్నారు. ప్రభుత్వం పామాయిల్‌ను బాయ్‌కాట్ చేయడం వంటివి చేస్తే మాత్రం తాము దౌత్యపరంగా ముందుకు వెళ్తామన్నారు. సౌత్ ఈస్ట్ ఏసియన్ దేశం నుంచి కొన్ని ఉత్పత్తుల దిగుమతిని భారత్ పరిమితం చేస్తే మలేషియా దౌత్యపరమైన పరిష్కారానికి వెళ్తుందన్నారు.

ఇండోనేషియాకు ప్రయోజనం
పన్నులు, ఇతరత్రా కారణాల దృష్ట్యా మలేషియా నుంచి పామాయిల్ దిగుమతుల్ని భారతీయ వ్యాపారులు తగ్గిస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలకుగాను దిగుమతుల్ని ఆపివేశారు. కాశ్మీర్ వివాదంలో భారత్ వైఖరిని మలేషియా విమర్శించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ తదితర ఉత్పత్తులపై మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. భారతీయ వ్యాపార వర్గాలు అప్రమత్తమయ్యాయి. మలేషియా నుంచి పామాయిల్ తగ్గిస్తే ఇండోనేషియాకు ప్రయోజనం చేకూరనుంది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications