దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలోని దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను చెప్పుకోదగిన స్థాయిలో పెంచుకుంటున్నాయి. దీనివల్ల మరింత ఎక్కువ మంది ఉద్యోగార్థులకు ఐటీ రంగంపై ఆసక్తి పెరుగుతోంది. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆయా నైపుణ్యాలు కలిగిన వారిని కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న వారికి కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇస్తున్నాయి.

మూడు దిగ్గజ కంపెనీల హవా
దేశంలో అగ్రస్థాయి ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో పాటు తర్వాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఎక్కువ స్థాయిలోనే ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ మూడు కంపెనీలు నికరంగా 28,157 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. మొదటి త్రైమాసికంతో పోల్చితే ఉద్యోగుల నియామకాలు (16,687) 59 శాతం పెరిగాయి. ఉద్యోగుల నియామకాలు పెరగడానికి కారణం లేకపోలేదు. భవిష్యత్తులో మంచి వ్యాపారం ఉంటుందన్న అంచనాలతో కంపెనీలు ఉద్యోగులను పెంచుకున్నాయి.
గత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి కంపెనీల్లో ఉద్యోగుల నియామకాలు తగ్గాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మళ్ళీ పెరగడం మొదలైంది. రెండో త్రైమాసికంలో ఇది మరింతగా పెరిగింది.

టీసీఎస్ లో అధికం
ఉద్యోగుల నియామకాల్లో టీసీఎస్ ముందుంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ గతంలో ఉన్న తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికరంగా 14,097 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఒక త్రైమాసికంలో ఇవే అత్యధిక నియామకాలు. ఇంతకు ముందు మొదటి త్రైమాసికంలో 12,356 మందిని కంపెనీ నియమించుకుంది.

ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ సెప్టెంబర్ త్రైమాసికంలో 7,457 మందిని నియమించుకుంది. జూన్ త్రైమాసికంలో నికరంగా కంపెనీ నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కేవలం 906 మాత్రమే. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 7,834 మందిని,
డిసెంబర్ త్రైమాసికంలో 7,762 మందిని, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 2,622 మందిని కంపెనీ నియమించుకుంది.

విప్రో
విప్రో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో 6,603 ,మందిని, జూన్ త్రైమాసికంలో 3,425 మందిని నియమించుకుంది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10,687 మందిని, డిసెంబర్ త్రైమాసికంలో 928 మందిని కంపెనీ నికరంగా ఉద్యోగాల్లోకి తీసుకుంది.

పెరుగుతున్న ఆర్డర్లు
ఐటీ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. భవిష్యత్ కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎక్కువ మందిని నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఉద్యోగులకు శిక్షణ
వర్ధమాన టెక్నాలజీలైన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, మెషిన్ లాంగ్వాజ్ లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కంపెనీలు తమ ఉద్యోగులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయి. టీసీఎస్ సెప్టెంబర్ చివరినాటికి 3.22 లక్షలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. మిగతా కంపెనీలు కూడా ఇదే పని చేస్తున్నాయి. ఇక కంపెనీలు తమ ఉద్యోగుల వలసలను తగ్గించుకోవడానికి కూడా తగిన వ్యూహాలు అనుసరిస్తున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications