దేశంలోని అత్యంత దానశీలుడిగా HCL టెక్నాలజీస్ చైర్మన్ శివనడార్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ, మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. 2019 సంవత్సరానికి గాను ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా సంయుక్తంగా జాబితాను రూపొందించాయి. ఈ జాబితాలో శివనాడార్, ఆయన ఫ్యామిలీ దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చిన విరాళం.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నవారి విరాళంతో కలుపుకుంటే దాదాపు సమానంగా ఉంది.

టాప్ 3.. శివనాడార్, ప్రేమ్ జీ, ముఖేష్
ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా ప్రకారం శివనాడార్, ఆయన ఫ్యామిలీ రూ.826 కోట్లు విరాళంగా ఇచ్చింది. అజీమ్ ప్రేమ్ జీ రూ.453 కోట్లతో రెండో స్థానంలో, ముఖేష్ అంబానీ రూ.402 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ దాతృత్వ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.

టాప్ 100లో టాప్ 10 వాటా 63 శాతం
వ్యక్తిగతంగా, కార్పోరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన వందమంది జాబితాను రూపొందించారు. జాబితాలోని 100 మంది మొత్తంగా ఇచ్చిన విరాళం రూ.4,391 కోట్లు. ఇందులో మొదటి పదిమంది వాటా 63 శాతంగా ఉండటం గమనార్హం.

90 శాతం పెరిగిన విరాళం
2018 ఏడాదితో పోలిస్తే జాబితాలో విరాళాల మొత్తం 90 శాతం పెరిగింది. 2018లో రూ.2,310 కోట్లు విరాళం ఇవ్వగా, ఈ ఏడాది రూ.4,391కు పెరిగింది. అలాగే, రూ.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వారి సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 38 మంది నుంచి 72కు చేరుకుంది.

విద్య కోసం ఎక్కువగా విరాళం
విరాళం ఇచ్చిన వారిలో కూడా విద్య కోసం ఎక్కువగా ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చారు. విద్య కోసం 59 మంది, ఆరోగ్య సంరక్షణ కోసం 53 మంది, కళలు, సంస్కృతి, వారసత్వం కోసం 18 మంది విరాళం ఇచ్చారు. మతపరమైన విరాళాలు కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం రూ.10 కోట్ల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భారతీయుల సంఖ్య 2018లో 38 ఉండగా, 2019లో 72కు చేరుకుంది.

వ్యక్తుల ఆధారం.. టాటాలను పరిగణలోకి తీసుకోలేదు..
వయస్సు పెరిగే కొద్ది దాతృత్వం వైపు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దాతల సగటు వయస్సు 64 ఏళ్లుగా ఉండటం గమార్హం. నవతరం ఎంటర్ ప్రెన్యూయర్లు కూడా దాతృత్వంలో ముందున్నారు. వ్యక్తుల ఆధారంగా జాబితాను రూపొందించినందున ఈ జాబితాలోకి టాటాలను తీసుకోలేదు.

టాప్ 4 నుంచి 10 వీరే...
ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నందన్ నీలేకని (రూ.204 కోట్లు), అయిదో స్థానంలో అజయ్ పిరామల్, ఫ్యామిలీ (రూ.200 కోట్లు), ఆరో స్థానంలో రోహిణి నీలేకని (రూ.142 కోట్లు), ఏడో స్థానంలో బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ (రూ.131 కోట్లు), ఎనిమిదో స్థానంలో

ముంబై నుంచి 11 మంది..
దాతృత్వ జాబితాలో ఎక్కువగా ముంబై నుంచి 31 మంది ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి 16 మంది, బెంగళూరు నుంచి 11 మంది ఉన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి కలిసి రూ.346 కోట్లు దాతృత్వ కార్యకలాపాల కోసం విరాళం ఇచ్చారు. ఇందుకు వీరు సామాజిక ప్లాట్ ఫామ్‌లను మార్గంగా ఎంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆరుగురు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా జాబితాలో అరబిందో ఫార్మా వ్యవస్థాపకులు పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.18 కోట్ల విరాళం ఇచ్చి 44వ స్థానంలో నిలిచారు. దివీస్ లాబొరెటరీస్ సీఎండీ మురళీ కే దివీ, ఆయన కుటుంబం రూ.15 కోట్లతో 45వ స్థానంలో, హెటిరో డ్రగ్స్ చైర్మన్ బీ పార్థసారథి రెడ్డి రూ.9 కోట్లతో 73 స్థానం, నవయుగ ఇంజనీరింగ్ చైర్మన్ సీ విశ్వేశ్వర రావు రూ.7 కోట్లతో 80వ స్థానం, డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్ చైర్మన్ కె సతీష్ రెడ్డి రూ.6 కోట్లతో 85వ స్థానం, హెటిరో డ్రగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి వంశీకృష్ణ రూ.6 కోట్లతో 85వ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications