న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి కేంద్ర ఆర్థిక విధానాలపై నిప్పులు చెరిగారు. విభజన, మెజార్టీవాదం దుష్పలితాలు ఇస్తాయని విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా రఘురాం రాజన్ పలుమార్లు స్పందించారు. నోట్ల రద్దును ఆయన వ్యతిరేకించారు. మెజార్టీవాదం, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయదని, అంతర్గత సమైక్యత, ఆర్థిక అభివృద్ధి బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
మెజార్టీవాదం జాతీయ భద్రతను మెరుగుపరుస్తుందనే వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని రఘురాం రాజన్ అన్నారు. అసలు బలహీనపరుస్తున్నారని విమర్శించారు. ఎందుకంటే వారు (కేంద్ర ప్రభుత్వం) తమదైన నిబంధనల జాతీయ సమైక్యతను కోరుకుంటున్నారన్నారు. మెజార్టీ జాతీయవాదం అంతర్గతంగా విభజించబడిందన్నారు. కొంతమంది పౌరులను 'ఇతరులు'గా ముద్ర వేస్తున్నారన్నారు. విభజన, ప్రజాస్వామ్య మెజార్టీవాదం కాకుండా అంతర్గత సమైక్యత, ఆర్థికాభివృద్ధి జాతీయ భద్రతకు దీర్ఘకాలంలో భారత్‌కు మూలంగా ఉంటుందని తన అభిప్రాయం అన్నారు.

మరోవైపు, భారత ఆర్థిక పరిస్థితులపై రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చింది. దేశ ఆర్థిక లోటును దాచిపెడుతున్నారని, అదే జరిగితే ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి తగ్గిస్తుందన్నారు. అసలు సమస్య ఏమంటే దేశం కొత్త వృద్ధి వనరులను గుర్తించలేదని, అలాగే కొన్నాళ్లుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించలేదన్నారు. NBFCలకు లిక్విడిటీ సమస్య, పెట్టుబడి మందగమనంను ప్రస్తావించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications