నగల వ్యాపారి మెహుల్ చోక్సీ గుర్తున్నాడు కదా? పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన వేల కోట్ల రూపాయల స్కాంలో నీరవ్ మోడీతోపాటు ఇతడూ నిందితుడే.. ఇప్పుడు గుర్తొచ్చింది కదా? తాజాగా ఈ మెహుల్ చోక్సీ చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది.
మెహుల్ చోక్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులను మాత్రమే కాదని, తమను కూడా ముంచాడని మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(పీఎస్బీ) తాజాగా వెల్లడించింది. దీంతో మెహుల్ చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపీ పెట్టినట్లయింది.

పీఎస్బీలో రూ.44.1 కోట్లకు...
మెహుల్ చోక్సీ తమ బ్యాంకుకు రూ.44.1 కోట్లు ఎగవేసినట్లు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తాజాగా ఆరోపించింది. తమకు చెల్లించాల్సిన అప్పుకు సంబంధించి.. 2018 అక్టోబరు 23 నుంచి వడ్డీతో సహా కలిపి చెల్లించాలంటూ అతడికి నోటీసు పంపినా స్పందన లేదు. దీంతో పీఎస్‌బీ కూడా చోక్సీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. ఈ రూ.44.1 కోట్లను మొండి బకాయిలుగా పేర్కొంటూ గత ఏడాది మార్చిలోనే తన పద్దుల్లో రాసుకున్న పీఎస్బీ.. బాకీ వసూలుకు చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్లు ప్రకటించింది.

వరుస మోసాలు.. జరిగిందిలా...
మెహుల్ చోక్సీ తమకు రూ.405 కోట్లు ఎగవేసి పారిపోయినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది ప్రకటించింది. ఆ తరువాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో చోక్సీ రూ.289 కోట్లు రుణం తీసుకుని ఎగవేసినట్లుగా ఆ బ్యాంకు తెలిపింది. ఈ విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ఓబీసీయే వెల్లడించింది. మెహుల్ చోక్సీకి చెందిన కంపెనీలు గీతాంజలి జెమ్స్ రూ.134.45 కోట్లు, నక్షత్ర వరల్డ్ లిమిటెడ్ రూ.59,53 కోట్లు తమకు ఎగవేసినట్లు ఓబీసీ తెలిపింది. వీటికి మెహుల్ చోక్సీ డైరెక్టర్‌గా, గ్యారెంటార్‌గా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు కూడా తమకు అతడు రూ.44.1 కోట్లు చెల్లించాలంటూ చోక్సీ బాధిత బ్యాంకుల జాబితాలో చేరింది.

ప్రస్తుతం.. ఎవరెక్కడ ఉన్నారంటే...
మెహుల్ చోక్సీ, అతడి సమీప బంధువు నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్లకుపైగా ముంచిన సంగతి విదితమే.పీఎన్‌బీ స్కాం అనంతరం 2018 ఫిబ్రవరిలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ.. దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ మోడీ బ్రిటన్‌లో ఉంటుండగా.. లండన్ పోలీసులు ఈ ఏడాది అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇతడ్ని ఇండియాకు అప్పగించే విషయమై ప్రస్తుతం అక్కడి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక మెహుల్ చోక్సీ మాత్రం ఆంటిగ్వా, బార్బుడాలో ఉంటున్నాడు.

‘‘నో డౌట్.. మోసగాడే, అప్పగిస్తాం...''
దేశంలోని వివిధ బ్యాంకులను ముంచేసిన కేసుల్లో నిందితుడైన నగల వ్యాపారి మెహుల్ చోక్సీని కూడా ఇండియాకు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, చోక్సీ కచ్చితంగా మోసగాడేనని ఆ దేశ ప్రధాని గ్యాస్టన్ బ్రౌన్ స్పష్టం చేశారు. అతి త్వరలో చోక్సీని ఇండియాకు అప్పగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications