న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో డీఏ 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. డీఏతో పాటు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా పెంచడంతో పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. డీఏ పెంపు నేపథ్యంలో ఉద్యోగులకు వేతనం రూ.900 నుంచి రూ.12,500 వరకు పెరుగుతుంది.
ఐదు శాతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో లెవల్ 1 బేసిక్ శాలరీ రూ.18,000కు గాను హైక్ రూ.900 పెరుగుతుంది. లెవల్ 2 బేసిక్ శాలరీ రూ.19,900పై రూ.995, లెవల్ 3 బేసిక్ శాలరీ రూ.21,700పై హైక్ రూ.1,085, లెవల్ 4 బేసిక్ శాలరీ రూ.25,500పై హైక్ రూ.1,275 పెరుగుతుంది. లెవల్ 5 బేసిక్ శాలరీ రూ.29,200పై హైక్ రూ.1460 వరకు పెరుగుతుంది.

తాజా డీఏ హైక్ నేపథ్యంలో ట్రాన్సుపోర్ట్ అలవెన్స్ (TA) కూడా పెరుగుతుంది. వీటి ద్వారా ఉద్యోగుల నెల వేతనంలో పెరుగుదల రూ.810 నుంచి రూ.4320 పెరగనుంది. 7వ సీపీసీ ప్రకారం అర్బన్ సిటీల్లో టీఏ కనీసం రూ.1350 పెరుగుతుండగా, గరిష్టంగా రూ.7200 వరకు పెరగొచ్చు. చిన్న నగరాల్లో టీఏ రూ.900 నుంచి రూ.3600 వరకు పెరుగుతుంది.
కాగా, కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఐదు శాతం పెంచుతూ దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. దీంతో ఉద్యోగుల డీఏ 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. ఇది ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా ప్రయోజనమే. ఎందుకంటే డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం DA పెంపు నిర్ణయం వల్ల 62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. దీని వల్ల వారికి పెన్షన్ మొత్తం పెరగనుంది.
డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెరగడంతో పెన్షనర్లకు వచ్చే పెన్షన్ రూ.450 మొదలు రూ.6250 వరకు పెరగనుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా DRను పెంచిందని చెబుతున్నారు. ఆలిండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ మాట్లాడుతూ... గత కొన్నేళ్లలో ఇదే అత్యధికం అన్నారు.
డియర్‌నెస్ రిలీఫ్ పెరగడంతో రూ.9,000 పెన్షన్ తీసుకునే వారికి రూ.450 పెరుగుతుందని, రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి రూ.6,250 పెరుగుతుందన్నారు. 2017 నుంచి మినిమం పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్ రూ.9,000 నెలకు వస్తోంది. ఇది కాకుండా పరిహారం మొత్తాన్ని కూడా రెండింతలు చేశారు. కంపన్షేషన్ అమౌంట్ రూ.10.15 లక్షల నుంచి రూ.25.35 లక్షల వరకు పెరిగిందని చెప్పారు.


Click it and Unblock the Notifications