తమ కస్టమర్లకు జియో షాక్ ఇచ్చిన తర్వాత వొడాఫోన్ ఐడియా మాత్రం తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఇతర టెలికం ఆపరేటర్స్‌కు కాల్ చేస్తే జియో తమ కస్టమర్ల నుంచి నిమిషానికి 6 పైసల్ ఛార్జ్ చేస్తోంది. దీని కోసం కొత్త IUC ప్లాన్‌ను తీసుకు వచ్చింది. ఈ టాపప్ కార్డ్స్ వేసుకుంటే ఉచిత డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జియోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం శుభవార్త చెప్పింది.
ఇతర నెట్‌వర్క్స్‌కు వాయిస్ కాల్ చేస్తే తాము ఎలాంటి IUC ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. IUC ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన అంశమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని వోడాఫోన్ ఐడియా పేర్కొంది. అంతేకాదు, IUC ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇంటర్ కనెక్ట మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు.

ట్రాయ్ నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినేషన్ ప్రకారం IUC ఛార్జీలు మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయాలని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది.
ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్ ఏ నెట్ వర్క్‌కు వెళ్లినా ఉచితమేనని తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సేవలను అందించడం తమకు లాభదాయకం కాకపోయినా సేవలను కొనసాగిస్తున్నామని చెప్పింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications