ముంబై: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ఆపరేటర్లకు ఫోన్ కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్ తారుమారైంది! ఇటీవలి వరకు జియో జోరు కనిపించింది. అదే సమయంలో ఇతర ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మార్కెట్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కానీ కాల్స్‌పై ఆరు పైసలు వసూలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా షేర్లు గురువారం దూసుకెళ్లాయి.

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా షేర్లు జూమ్
వొడాఫోన్ ఏడియా షేర్లు నిన్న (అక్టోబర్ 10) 18 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎయిర్ టెల్ 4.8 శాతం దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఇతర నెట్ వర్క్స్‌కు ఉచిత కాల్స్ సదుపాయం అందించిన జియో ఇప్పుడు నిమిషానికి కొంత మొత్తం వసూలు చేస్తోంది. దానికి బదులు డేటా ఇస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు షేర్లు ఈ రోజు (శుక్రవారం, అక్టోబర్ 11) కూడా ఎగిశాయి.

అక్టోబర్ 10వ తేదీ నుంచి రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే...
తక్కువ మొత్తానికే డేటా, వాయిస్ కాల్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు జియో యూజర్లు భారీగా పెరిగారు. జియో త్వరగా ఎదగడానికి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా ఎంత సమయమైనా ఉచితంగా మాట్లాడుకునే వెసులుబాటు కల్పించడం. దీంతో జియో దెబ్బకు ఇతర టెలికం సంస్థలు దెబ్బతిన్నాయి.
ఇప్పుడు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (IUC) చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో జియోపై ప్రభావం పడింది. ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు రీచార్జ్ చేసుకున్న వారికి IUC ఛార్జీలు అవసరం లేదు. 10వతేదీ నుంచి రీచార్జ్ చేసుకుంటే చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్ టెల్ ఏం చెప్పిందంటే..
జియో IUC ప్రకటనపై ఎయిర్ టెల్ ఇటీవల స్పందించింది. నిమిషానికి ఆరు పైసలు విధించడం ద్వారా ఐయూసీ ఛార్జీలని ట్రాయ్ తగ్గించాలని జియో ఒత్తిడి చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. అయితే జియో పేరును మాత్రం ప్రరస్తావించలేదు. ఐయూసీ ఛార్జీలను పూర్తిగా ట్రాయ్ రద్దు చేసేందుకు తమ ప్రత్యర్థి నెట్ వర్క్ నిమిషానికి ఆరు పైసలు అంశాన్ని తెరపైకి తెచ్చిందని పేర్కొంది. 2017లో IUC ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించడంపై ఎయిర్ టెల్ ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications