For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్: 68వ స్థానానికి పడిపోయిన భారత్.. కారణాలేమిటి?

|

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడలేకపోయింది. అసలే ఆర్థిక మందగమనం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మన దేశం ఈ ఏడాది 10 స్థానాలు కిందికి జారిపోయి 68వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ పోటీలో అగ్రరాజ్యం అమెరికాను సింగపూర్ బీట్ చేసింది. ఈ ఏడాది వరల్డ్ మోస్ట్ కాంపిటీటివ్ కంట్రీగా సింగపూర్ నిలిచింది.

మరోవైపు హాంకాంగ్ కూడా ఈసారి నాలుగు స్థానాలు పైకి ఎగబాకి, 3వ ర్యాంకు పొందింది. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, మార్కెట్ పరిమాణంలో మన దేశం ఎక్కువ ర్యాంకులనే పొందినా.. ఫైనాన్షియల్ సెక్టార్ విషయానికొచ్చేసరికి కాస్త స్పీడు తగ్గినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక చెబుతోంది.

సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నిజమేంటో తెలుసుకోండి!సొమ్ము భద్రం: LIC ఆర్థిక పరిస్థితి బాగాలేదా? నిజమేంటో తెలుసుకోండి!

ఏమిటీ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్?

ఏమిటీ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్?

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాటి తీరుతెన్నులను వివరించేదే ఈ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్. దీనిని 1979లో మన దేశమే పరిచయం చేసింది. 12 పిల్లర్స్ కిందికి వచ్చే 103 సూచీలతో మొత్తం 141 దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ సర్వేను నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ రిపోర్టును వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) విడుదల చేస్తుంది.

ఈ ఏడాది ఎవరి స్థానాలు ఏమిటంటే...

ఈ ఏడాది ఎవరి స్థానాలు ఏమిటంటే...

గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో ఈ ఏడాది వరల్డ్ మోస్ట్ కాంపిటీటివ్ కంట్రీగా సింగపూర్ నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్ని మరీ సింగపూర్ ఈ ఘనత సాధించింది. హాంకాంగ్ కూడా గత ఏడాది కంటే నాలుగు స్థానాలు పైకి ఎగబాకి 3వ స్థానానికి చేరింది. భారత్ ఈ ఏడాది పది స్థానాలు కిందికి పడిపోయి 68వ స్థానంలో నిలవగా.. మన పొరుగుదేశాలైన శ్రీలంక 84వ స్థానంలో, బంగ్లాదేశ్ 105వ స్థానంలో, నేపాల్ 108వ స్థానంలో, పాకిస్తాన్ 110వ స్థానంలో నిలిచాయి.

భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితేమిటి?

భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితేమిటి?

ఈ గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌ రూపకల్పనలో.. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 12 పిల్లర్స్ కిందికి వచ్చే 103 సూచీలపై సర్వేను నిర్వహిస్తారు. ఇక ఇండియా విషయానికొస్తే.. కార్పొరేట్ గవర్నెన్స్‌లో 15వ స్థానం పొందగా, షేర్ హోల్డర్స్ గవర్నెన్స్‌లో రెండో స్థానం పొందింది. మార్కెట్ పరిమాణానికి వస్తే మన దేశం 3వ స్థానంలో ఉంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ రెగ్యులేషన్స్ ర్యాంకులో కూడా మన దేశం ఇదే స్థానంలో ఉంది. ఇక ఇన్నోవేషన్ విభాగంలో ఇంకా డెవలప్‌మెంట్ స్టేటస్‌లోనే ఉంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే మన దేశం చాలా మెరుగైన స్థానంలో ఉంది.

ఎక్కడెక్కడ వెనకబడిందంటే...

ఎక్కడెక్కడ వెనకబడిందంటే...

ఎన్ని విషయాల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ పోటీతత్వ విషయానికొచ్చేసరికి మన దేశం కొన్ని కీలకమైన విషయాల్లో వెనుకబడిపోయింది. ఐసీటీ(ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్, టెక్నాలజీ) అడాప్షన్, ఆరోగ్యకరమైన జీవనం, ఆయుర్దాయం పెరుగుదల తదితర విషయాల్లో మన దేశం వెనుకబడే ఉన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక పేర్కొంటోంది. ఆరోగ్యకరమైన జీవన విధానంలో.. ఇండెక్స్‌లోని 141 దేశాలతో పోల్చి చూస్తే.. మన దేశానిది 109వ ర్యాంకు. అలాగే నైపుణ్యం విషయంలోనూ 107వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

గ్లోబల్ ర్యాంక్ తగ్గుదలకు ఇవీ కారణాలు...

గ్లోబల్ ర్యాంక్ తగ్గుదలకు ఇవీ కారణాలు...

ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు విభాగాల్లో కాస్త స్కోర్ తగ్గడంతో ఈ ఏడాది భారత్ ర్యాంకు పది పాయింట్లు తగ్గిపోయింది. మరోవైపు కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ఇండియాకు దగ్గరగా వాటి స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, మార్కెట్ పరిమాణంలో మన దేశం ఎక్కువ ర్యాంకులనే పొందినా.. ఫైనాన్షియల్ సెక్టార్ విషయానికొచ్చేసరికి కాస్త స్పీడు తగ్గింది. వాణిజ్య స్వేచ్ఛ లేకపోవడంతో ప్రొడక్ట్ మార్కెట్ ఎఫీషియన్సీ కూడా తక్కువగానే ఉంది. ఇంకా కార్మికుల హక్కుల పరిరక్షణలో, కార్మిక మార్కెట్ విధానాల్లో కూడా ఇండియా వెనుకబడింది. పురుష, మహిళా కార్మికుల రేషియో (0.26)లో కూడా మన దేశం బాగా వెనుకబడి ఉంది.

English summary

గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్: 68వ స్థానానికి పడిపోయిన భారత్.. కారణాలేమిటి? | India’s rank slips on global competitive index to 68th place

India has slipped 10 spots to rank 68th out of 141 surveyed countries in the annual global competitiveness index as several other economies in the world climbed up on the list due to improvements in economic and business activities.
Story first published: Thursday, October 10, 2019, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X