ఎవరైనా భారీ వేతనం పొందుతున్నారు అంటే... వారు బాగా సంపాదిస్తున్నట్లే లెక్క వేస్తాం. చూడరా... వాడు ఎంత ఎదిగిపోయాడో అని ఉదాహరణగా చెబుతాం. వాడికేం కావాలి నెలకు లక్షల్లో వేతనం, బాగా సంపాదించేస్తున్నాడు అని ఓ సర్టిఫికెట్ కూడా తగిలించేస్తాం. కానీ అది అన్ని సందర్భాల్లో నిజం కాదట. కేవలం
భారీ వేతనం వచ్చినంత మాత్రాన ఎవరైనా బాగా సంపాదిస్తున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. వినటానికి కొంచెం వింతగా అనిపించినా... ఇది మాత్రం నిజమేనట. దీనికి వారు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. అదే సమయంలో అధిక సంపాదనను తెలివిగా మేనేజ్ చేసుకోవటానికి చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవేమిటో చూద్దామా మరి?

భారీ పన్ను పోటు...
మన దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు అధికం. రూ 2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. రూ 5 లక్షల లోపు ఆదాయంపై 5% పన్ను పడుతుంది. కానీ రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల ఆదాయంపై 20% ... ఆ పైన ఆదాయంపై 30% పన్ను విధింపు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇండియాలో కూడా వేతనాలు భారీగా పెరిగాయి. మిడ్ మానేజ్మెంట్ లెవెల్ ఉద్యోగుల వేతనాలు సగటున ఏడాదికి రూ 10 లక్షల నుంచి రూ 12 లక్షలుగా ఉంటోంది. అదే బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే జనరల్ మేనేజర్ అంతకంటే అధిక హోదా కలిగిన వారి వేతనం రూ 25 లక్షలు.. అంతకంటే అధికంగా ఉంటోంది. దీంతో వీరు 30% పన్ను పరిధిలోకి వచ్చేస్తున్నారు. అన్ని రకాల మినహాయింపుల తర్వాత కూడా వీరు అధిక పన్ను స్లాబులో ఉంటున్నారు. దీంతో వీరితోటి ఉద్యోగుల తో పోల్చితే చేతికి అందే మొత్తం పెద్దగా అధికంగా ఏమి ఉండటం లేదు. కింది స్థాయి ఉద్యోగుల పన్ను రేటు తక్కువగా ఉండటంతో తేడా తగ్గిపోతోంది.

ఖర్చులు అధికం...
హోదా కు తగ్గట్లు జీవన శైలి కూడా మారుతుంది. దాంతో అవసరానికి మించిన వ్యయాలు చేయల్సీ వస్తుందని ఫైనాన్సియల్ మేనేజర్స్ చెబుతున్నారు. తొలుత ఇంటి అద్దె రూపంలో వారికీ భారీ ఖర్చు మొదలవుతుంది. సాధారణంగా రెండు గదుల అద్దె ఇల్లు సరిపోతే, పై హోదా వల్ల మూడు గదుల ఇళ్ళకు మారాల్సి వస్తుంది. దీంతో 50% ఇంటి అద్దె పెరుగుతుంది. మరో వైపు ఉండే ప్రాంతం కూడా అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. దీంతో అద్దెలు మరింతగా పెరుగుతాయి. ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్, దుస్తులు, పెర్ఫ్యూమ్, ఫుడ్ వంటి అన్ని విషయాల్లోనో ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో పొదుపు చేయటంపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతుంది. అనవసరమైన వాటిని కూడా కొంటారు. నాకు నెలకు రూ 5 లక్షల వేతనం అని మా ఆవిడకు తెలుసు. కానీ దానిపై ఎంత ఆదయ పన్ను చెల్లించాలో తనకు తెలియదు. అందుకే, ప్రతి కొనుగోలు లోనూ ఆమె భారీగా ఖర్చు పెట్టెలా చేస్తుంది. మొహమాటం కొద్దీ నేను కూడా కాదనలేక పోతున్న. అందుకే క్రెడిట్ కార్డుల పై ఎక్కువగా ఆధారపడుతున్న అని ఒక యానిమేషన్ కంపెనీ లో వర్టికల్ హెడ్డుగా పనిచేస్తున్న రణవీర్ వాపోయారు.

పెద్ద ఇంటి కొనుగోలు...
సాధారణంగా జీత భత్యాలు, ఆదయ మార్గాలను బట్టి మనం కొనుగోలు చేయబోయే ఇంటి విలువ, దానికోసం తీసుకొనే రుణాన్ని అంచనా వేస్తాం. కానీ భారీ వేతన జీవులు రూ 1 కోటి విలువ ఉండే మూడు పడక గదుల అపార్ట్మెంట్ కంటే, రూ 2.5 కోట్ల విలువ చేసే విల్లా ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కారణం ఏమిటంటే... ఒకవైపు ఇంట్లో వారిని తృప్తిపరచటం, మరో వైపు మిగతా వారికి ఏమాత్రం తీసిపోవట్లేలేదనే భావన కోసం కూడా శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. దీంతో, ఆదయ పన్ను మినహాయింపుల ప్రయోజనం కూడా వీరికి పెద్దగా కలిసి రాదు. ఇంటి కొనుగోలు కోసం తీసుకొనే ఋణం భారీగా పెరిగిపోతోంది.

రిస్కీ పెట్టుబడులు...
ఎదుటివారిని చూసి తమకు అనుభవం లేని స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్ లు వంటి రిస్కీ పెట్టుబడులకు కూడా అధిక వేతనం ఉన్న వారు మొగ్గు చూపుతారని ఫైనాన్సియల్ సేవలు అందించే శ్రీనివాస్ రావు పేర్కొంటున్నారు. అనుభవ లేమి కారణంగా మార్కెట్లు పెరుగుతున్నపుడు అధికంగా పెట్టుబడి పెట్టి, వాటి పట్నంలో భయానికి లోనై షేర్లు అమ్మేస్తారని, తద్వారా పెద్ద మొత్తంలో నష్టపోతారని విశ్లేషించారు. ఇది అందరికీ వర్తించక పోయిన... ఎక్కువ మంది ఇలాగే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

మొహమాటం...
తమ హోదా పెద్దది కావటం తో తమకు తెలియని విషయాలను ఇతరుల నుంచి తెలుసుకొనేందుకు వీరు మొహమాట పడుతున్నారని పలువురు ఆర్థిక రంగ నిపుణులు వెల్లడించారు. దీంతో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటుకు గురి అవుతున్నారని చెబుతున్నారు. అలాగే, ఎక్కడైనా ఆర్థికంగా నష్టపోయినప్పుడు కూడా వీరు కుటుంబ సభ్యులకు గానీ.... మిత్రులకు గానీ వెల్లడించటం లేదన్నారు. మొహమాటం కారణంగానే సీనియర్ మేనేజర్స్ అధికంగా ఇలా నష్టపోతున్నారని విశ్లేషించారు. సో, దీన్ని బట్టి చూస్తే... ఎక్కువ వేతనం ఉండగానే బాగా సంపాదిస్తున్నట్లు కాదు అని తేలిపోతోంది. అందుకే, ఇప్పటికైనా ఇలాంటి వారు నిపుణులు ఐన వారి నుంచి సరైన సలహాలు స్వీకరించి క్రమ పద్దతిలో పెట్టుబడులు, పొదుపు చేయాలనీ, ఆర్థికంగా మెరుగ్గా స్థిరపడాలని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications