For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్, డీఏ 5 శాతం పెంపు

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ బొనాంజా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

అమెజాన్ దీపావళి సేల్స్: తేదీ, ఆఫర్స్, డిస్కౌంట్అమెజాన్ దీపావళి సేల్స్: తేదీ, ఆఫర్స్, డిస్కౌంట్

డీఏ 5 శాతం పెంపు...

డీఏ 5 శాతం పెంపు...

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 62 లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులకు DAను 5 శాతం పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. ప్రస్తుత నిర్ణయంతో DA 17 శాతానికి చేరుకుంటుందని, ఇది ఉద్యోగులకు దీపావళి కానుక అన్నారు.పలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని మోసేందుకు ముందుకు వచ్చిందన్నారు.

ప్రభుత్వ ఖజానాపై రూ.16వేల కోట్ల భారం.. ఆశావర్కర్లకూ..

ప్రభుత్వ ఖజానాపై రూ.16వేల కోట్ల భారం.. ఆశావర్కర్లకూ..

ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.16వేల కోట్ల భారం పడుతుంది. అలాగే, ఆశా వర్కర్లకు కూడా కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు జవదేకర్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.1000గా ఉన్న రెమ్యునరేషన్ ప్రస్తుతం రూ.2,000లకు చేరుకుంటుంది.కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయికి ఆశా వర్కర్లు తీసుకెళ్తున్నారని, వీటిని బాధ్యతాయుతంగా అమలు చేస్తున్న వారి సేవలను మోడీ ప్రభుత్వం విస్మరించదన్నారు.కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే రైతు బంధు డబ్బుల కోసం ఆధార్ అనుసంధాన ప్రక్రియను నవంబర్ 30వ తేదీ వరకు సడలిస్తున్నట్లు తెలిపారు.

మోడీ నాయకత్వంలో ఉద్యోగులకు శుభవార్త...

మోడీ నాయకత్వంలో ఉద్యోగులకు శుభవార్త...

'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తీసుకు వచ్చాం. డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతం పెంచుతున్నాం' అని జవదేకర్ ప్రకటించారు. ఈ చర్య కార్మిక వర్గాలనికి మంచి ఉపశమనం అన్నారు. అదే సమయంలో అనేక రంగాల డిమాండ్ మందగించిందని, వీటిపై కూడా ఉద్దీపన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

English summary

మోడీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్, డీఏ 5 శాతం పెంపు | Govt announces 5 percent hike in dearness allowance for employees and pensioners

In a Diwali gift to central government employees and pensioners, Narendra Modi government today announced the highest ever 5 per cent hike in dearness allowance (DA). The hiked rate will be applicable retrospectively from July this year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X