వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ నుంచి బీఎస్ 6 ఇంధనం వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఎస్ 6 ప్రమాణాలతో వాహనాలు, బీఎస్ 6 ఇంధనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీని వల్ల 80 నుంచి 90 శాతం వరకు కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ కింద 122 పట్టణాలలో కాలుష్యం తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు కూడా విడుదల చేసిందన్నారు. ఇందుకోసం రూ.60,000 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం తగ్గించేందుకు కృషి చేస్తున్న కంపెనీలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ప్రకాశ్ జవదేకర్ దసరా పర్వదినం సందర్భంగా మంగళవారం జైపూర్‌లోని మాలవియా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

కాగా, గత ఏడాది అక్టోబర్ 24వ తేదీన సుప్రీం కోర్టు ఏప్రిల్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బీఎస్ 4 వాహనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విక్రయించరాదని ఆదేశించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications