వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిపై ప్రభావం చూపుతుంది. అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా ఇప్పటికే హెచ్1బీ వీసా సహా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆరోగ్య బీమాలేని లేదా వైద్య ఖర్చులను భరించే స్తోమతలేని వారిని దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆరోగ్య పరిరక్షణ విభాగానికి భంగం కలిగించని వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తామని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధన వచ్చే నెల (నవంబర్) 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

30 రోజుల్లో...
వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి తాము 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకుంటామని లేదా ఆరోగ్య ఖర్చులు తామే భరించగలమని హామీ ఇవ్వాలి. అలా ఇవ్వని పరిస్థితుల్లో వీసాను తిరస్కరిస్తారని ఉత్తర్వుల్లో ఉంది. అక్రమ వలసదారులను అడ్డుకొని, అమెరికా పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరింత క్లిష్టతరం
అమెరికా రావాలనుకునే వారికి ఈ నిర్ణయం మరింత క్లిష్టమైనదే. అంటే ఆరోగ్య బీమా లేకపోతే ఇబ్బందులు తప్పవు. బీమా లేకపోయినా లేదా వైద్య ఖర్చులను సొంతగా భరించగలమని నిరూపించలేని వారు ఇమ్మిగ్రెంట్ వీసా ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు. దీనికి బీమా లేదా ఆర్థికపరమైన ఆధారం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపించాలి.

నెల రోజుల్లో పూర్తి చేయాలి..
వీసా దరఖాస్తు చేసుకునే వారు నెల రోజుల్లో పైవాటిని చూపించాలి. అమెరికాలో అడుగుపెట్టాక ఇస్తామంటే కుదరదు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, అమెరికా పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పరిహారం రాని ఆరోగ్య ఖర్చుల వల్ల గత పదేళ్లలో ప్రతి ఏటా 35 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం అయినందు వల్ల కూడా కొత్త ఆంక్షలు అంటున్నారు.

భారతీయులపై ప్రభావం
తెలిసినవారి ద్వారా అంటే దగ్గరి బంధువులు లేదా మిత్రుల ద్వారా అమెరికాకు 35వేల మంది వరకు భారతీయులు వెళ్తుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెరికాలో వలసదారులు స్థిరపడటానన్ని క్లిష్టతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. తాత్కాలిక టూర్, వర్క్ రిలేటెడ్ వీసాలకు ఇమ్మిగ్రెంట్ వీసా భిన్నం. అమెరికా పౌరులు స్పాన్సర్ చేసినవారికి లేదా గ్రీన్ కార్డుదారులు స్పాన్సర్ చేసినవారికి వీటిని మంజూరు చేస్తారు.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications