ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.90,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు సహా వివిధ ఉద్దీపన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులను సమీకరించనుంది.
ఓ వైపు కార్పోరేట్ పన్ను తగ్గింపుతో పాటు వివిధ ఉద్దీపనలు, మరోవైపు నిరాశాజనక జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో రెవెన్యూ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ రంగాల్లోని ఆస్తుల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల వరకు సమకూర్చుకునేందుకు ప్రణాళికను రూపొందించింది. విమానయాన రంగంలో రూ.15,000 కోట్లు, విద్యుత్ రంగంలో రూ.20,000 కోట్లు, షిప్పింగ్ రూ.7,500 కోట్లు, రహదారుల రంగంలో రూ.25,000 కోట్లు, రైల్వే రంగంలో రూ.22,000 కోట్ల విలువైన ఆస్తులు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో కేబినెట్ ఆమోదం కోసం పంపించనుందని సమాచారం.

షెడ్యూల్ ప్రకారం అసెట్స్ సేల్ జరగాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అధ్యక్షత ఏర్పాటైన కమిటీ ఆయా మంత్రిత్వ శాఖలను నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. ఈ అసెట్ సేల్ ప్రణాళికకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సారథ్యం వహిస్తున్నారని సమాచారం.
వాటాల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ సెప్టెంబర్ నాటికి రూ.12,357 కోట్లు మాత్రమే సమీకరించింది.
BPCL, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), THDC, NEEPCలో వాటా విక్రయించనుంది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో సైతం ముప్పై శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కాంకర్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.66 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరవచ్చని అంచనా.
విక్రయానికి పెట్టనున్న ఆస్తులు ఇవే...
- ఏవియేషన్ రంగంలో తిరుచ్చి, ఇండోర్, భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, రాయపూర్‌లోని విమానాశ్రయాలు.
- విద్యుత్ రంగంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌కు చెందిన విద్యుత్ సరఫరా లైన్లు.
- నౌక రవాణా రంగంలో పోర్ట్ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న బెర్తులతో సహా మొత్తం 11 షిప్పింగ్ ఆస్తులు.
- జాతీయ రహదారుల విషయానికి వస్తే మొత్తం 25,000 కిలో మీటర్ల రోడ్డు ప్రాజెక్టులు.
- రైల్వేలో 150 పాసింజర్ రైళ్ల ప్రయాణ నిర్వహణ ప్రైవేటు వర్గాలకు అప్పగింత.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications