2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనా 6.3 శాతం

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. అయితే 2020-21లో అనూహ్యమైన, మంచి వృద్ధి ఉంటుందని, ఇది 7 శాతం వరకు ఉంటుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ మంగళవారం తెలిపింది. భారత్ వృద్ధి మందగమనం అంచనాల కంటే తక్కువగా ఉందని, ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో ఎకానమీ అంచనా 7 శాతంగా వేయగా 5 శాతానికి తగ్గిందని, ఎకానమీకి ఇంజిన్ వంటి ప్రయివేటు కన్సంప్షన్ గ్రోత్ తగ్గిందని ఏసియా పసిఫిక్ రీజియన్ తన నివేదికలో పేర్కొంది.

మంగళవారం IHS మార్కిట్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ నెలలో పీఎంఐ 51.4గా ఉంది. ఆగస్ట్ నెలలో ఇది ఆగస్ట్ 2018 తర్వాత కనిష్టానికి దిగజారింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లోను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మందగమనం కనిపిస్తోందని పేర్కొంది.

S&P slashes India growth forecast for FY20 to 6.3%

పరిశ్రమల విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలోని ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాల ఉత్పత్తి ఆగస్ట్ నెలలో గత నాలుగేళ్లలో తొలిసారి 0.5 శాతంగా చూపించింది. సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన నాన్ ఫుడ్ క్రెడిట్ గ్రోత్ కన్సంప్షన్ డిమాండ్ ఆగస్ట్ నెలలో 9.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో 12.4 శాతంగా ఉంది.

కాగా, కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన ప్రకటనల కారణంగా కొంత సానుకూలంగా ఉంటుందని ఎస్ అండ్ పీ తెలిపింది. మరిన్ని సానుకూల ప్రకటనలు రావొచ్చునని అభిప్రాయపడింది. ఉదాహరణకు రైతులకు ఆదాయ బదలీలు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+