అనిల్ అంబానీ సంచలన నిర్ణయం, రుణ వ్యాపారానికి గుడ్‌బై

అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రుణ వితరణ వ్యాపారానికి గుడ్ బై చెప్పాలని రిలయన్స్ కేపిటల్ (Rcap) నిర్ణయించింది. సోమవారం జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ప్రకటించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న అడాగ్ గ్రూప్‌కు చెందిన 3 కంపెనీల ఏజీఎంలలో సోమవారం అంబానీ పాల్గొన్నారు. గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులేటరీ, ఆర్బిట్రేషన్, కారణంగా తమ కంపెనీకి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలు గత అయిదు నుంచి పదేళ్లుగా పెండింగులో ఉన్నాయన్నారు.

అనుబంధ కంపెనీలు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రిలయన్స్ క్యాపిటల్ MSME, గృహాల కొనుగోలుదారులకు రుణాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అనుబంధ కంపెనీల్లో ప్రధాన వాటాదారుగా మాత్రం కొనసాగుతామని తెలిపారు. రిలయన్స్ ఇన్ఫ్రాకు మౌలిక సదుపాయాల రంగంలో మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఆర్ఇన్ఫ్రాకు కలిసి వస్తుందన్నారు. రక్షణ రంగంలో మరిన్ని వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ 5 ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సరఫరా సంస్థగా మారుతామన్నారు.

Anil Ambanis Reliance Capital to exit lending business

ప్రస్తుతం రూ.6,000 కోట్ల వరకు ఉన్న ఆర్ఇన్ఫ్రా అప్పుల భారాన్ని మరింత తగ్గిస్తామన్నారు. అదే సమయంలో భారీగా ఆస్తులు కూడా ఉన్నాయన్నారు. రిలయన్స్ పవర్ ద్వారా త్వరలో సౌర, పవన విద్యుదుత్పత్తి రంగాల్లోకి ప్రవేశిస్తామన్నారు. ప్రస్తుత థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా రూ.4,000 కోట్ల ఖర్చుతో ప్లూ గ్యాస్ డిసల్పరైజేషన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారులు, మెట్రో, ఇంధనం, విమాాశ్రయాలు సహా ాలుగు వ్యాపార విభాగాలకు పూర్తి నిధుల లభ్యత ఉందన్నారు.

దేశ మౌలిక అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కంపెనీ రూ.7000 కోట్ల విలువైన వెర్సోవా-బాంద్రా సీలింగ్ ప్రాజెక్టు వంటి భారీ ఆర్డర్లు అందుకుందని చెప్పారు. ఢిల్లీ - ఆగ్రా టోల్ రోడ్ విక్రయం వచ్చే కొన్ని వారాల్లో ముగిసే అవకాశం ఉందని, దీంతో ఆర్ ఇన్ఫ్రాకు రూ.3600 కోట్లు వస్తాయన్నారు.

ఇదిలా ఉండగా, ఆర్.కామ్.దివాలా ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ భవిష్యత్తుపై వాటాదార్లు ఆందోళగా ఉన్నారు. సంస్థ దివాలా ప్రక్రియ నడుస్తుండటం వల్ల కార్పోరేట్ పరిష్కార ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్సీఎల్టీ అదనంగా మూడు నెలల సమయం కేటాయించింది. జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని వాటాదార్లకు స్పష్టం చేశారు. అలాగే, నేవీ ముంబైలో కంపెనీకి చెందిన అతిపెద్ద స్థిరాస్థి ధీరుబాయ్ అంబానీ నాలెడ్జ్ సెంటర్ భవిష్యత్తుపై స్పష్టమైన సమాచారం కావాలని వాటాదార్లు కోరుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+