దేశమంతా ఆర్థిక మందగమనం ఆవహించిన వేల ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మాత్రం ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. సుమారు 9,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు దాదాపు అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలను ఇవ్వనుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 9,000 ఉద్యోగాల్లో 4,000 వరకు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉండనున్నాయని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. దశాబ్ద కాలంలో కోల్ ఇండియా ప్రకటించే అతిపెద్ద రిక్రూట్మెంట్ ఇదే కానుందని అంటున్నారు. మొత్తం ఉద్యోగాలను కోల్ ఇండియా తో పాటు తన ఎనిమిది అనుబంధ సంస్థలు కలిసి భర్తీ చేయనున్నాయి. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలను ఈ ఏడాది భర్తీ చేయాలని నిర్ణయించాం. గతేడాది మేము కేవలం 1,200 మందిని మాత్రమే నియమించాం అని కోల్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు ఈటీ కి తెలిపారు.

భారీ ఉద్యోగాల కేంద్రం...
ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ ఐన కోల్ ఇండియా... భారీగా ఉద్యోగాలు ఇచ్చే విషయం లోనూ ముందు వరుసలో ఉంటుంది. భారత్ లో ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీల్లో కోల్ ఇండియా కూడా ఒకటి కావడం విశేషం. ఇండియన్ రైల్వేస్ తర్వాత 2,80,00 ఉద్యోగాలతో దేశంలోనే రెండో అతిపెద్ద ఉద్యోగులు కలిగిన కంపెనీ గా కోల్ ఇండియా రికార్డు సృష్టించింది. ఇందులో 18,000 వరకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగులున్నారు.

క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా..
కోల్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విభాగంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ను కూడా చేపట్టనుంది. మొత్తం 9,000 ఉద్యోగాల్లో కోల్ ఇండియా ఒక్కటే 4,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా సుమారు 400 మందిని నియమించుకోనుంది. ఒక 100 మంది మెడికల్ ఆఫీసర్ల ను కూడా తీసుకోనుంది. సుమారు 900 ఉద్యోగులను ప్రకానల ఇచ్చి ఇంటర్వ్యూ ప్రాతిపదికన నియమించాలని భావిస్తోంది. కాగా 2,200 ఉద్యోగులను మాత్రం పోటీ పరీక్ష ద్వారా నియమించనుంది. ఇప్పటికే 400 మంది ఎగ్జిక్యూటివ్స్ ని నియమించుకోగా... అందులో ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. మరో 75 మెడికల్ ఆఫీసర్స్ ను ఈ పద్ధతిలో రిక్రూట్ చేయనుంది.

అనుబంధ కంపెనీల్లో 5000 మంది ..
కోల్ ఇండియా అనుబంధ కంపెనీలు అన్ని కలిసి సంయుక్తంగా 5,000 ఉద్యోగులను నియమించుకోనున్నాయి. అయితే ఇందులో అధిక ఉద్యోగాలు భూ నిర్వాసిత కుటుంబాలకు, రిటైర్మెంట్ కు ముందే మరణించిన ఉద్యోగి కుటుంబాలకు దక్క నున్నయని తెలిసింది. సుమారు 2,300 ఉద్యోగాలను వివిధ గనుల వద్ద భూములు కోల్పోయిన కుటుంబాలకు చెందిన వారికి ఇవ్వనుండగా... మరో 2,350 ఉద్యోగాలు మరణించిన ఉగ్యోగి కుటుంబ వ్యక్తికి కేటాయించారు. మిగిలిన 400 ఉద్యోగాలను నాన్-టెక్నికల్ విభాగంలో భర్తీ చేస్తారు.

ప్రొమోషన్లను కూడా...
కోల్ ఇండియాలో గత మూడేళ్ళ లోనే సుమారు 12,300 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. దశాబ్ద కాలంగా నియామకాలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పటివరకు కేవలం అత్యవరస ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుండగా ... ఇకపై కొన్నేళ్ల పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయక పోయినా... ఇప్పటిలాగే భారీ స్థాయి నియామకాలు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా... చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు, ప్రమోషన్లు కూడా ఇస్తోంది. 2013 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్రక్రియను 2017 వరకు పూర్తి చేసి సుమారు 3,000 మందికి ప్రమోషన్లు కల్పించింది. మరో 3,000 మందికి త్వరలోనే ప్రమోషన్లు లభించనున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications