For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్, రూ.1 లక్ష బోనస్

|

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి SCCLలో 28 శాతం ప్రాఫిట్‌ను ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగులు బోనస్‌గా రూ.1,00,899 పొందనున్నారు. అంటే గత ఏడాది కంటే ఇది రూ.40,530 ఎక్కువ. కార్మికుల సమన్వయంతో సింగరేణి రికార్డ్ స్థాయి ఉత్పత్తిని సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

SBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులుSBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులు

సింగరేణికార్మికులకు దసరా కానుక

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా భారీ మొత్తాన్ని బోనస్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. SCCLలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం వాటా 51:49గా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1765 కోట్ల రికార్డ్ నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వర్కర్స్‌కు రూ.60,369 (27 శాతం) ఇచ్చారు. ఇప్పుడు 28 శాతం ఇచ్చారు.

పెరుగుతున్న నెట్ ప్రాఫిట్..

పెరుగుతున్న నెట్ ప్రాఫిట్..

సింగరేణి వర్క్ ఫోర్స్ 56,000కు పైగా ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1212 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. ఈ ఏడాది అంతకంటే రూ.500 కోట్లకు పైగా ఎక్కువ ప్రాఫిట్ నమోదు చేసింది. 2013-14లో కంపెనీ 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా ప్రతి ఏడాది పెరుగుతోంది. 2018-19 సంవత్సరానికి 64.41 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.

పెరుగుతూ వచ్చిన బోనస్

పెరుగుతూ వచ్చిన బోనస్

2013-14లో నెట్ ప్రాఫిట్ రూ.418 కోట్లు కాగా, 2018-19లో నెట్ ప్రాఫిట్ రూ.1765 కోట్లుగా ఉంది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి ప్రగతి సాధిస్తోందని చెప్పారు. సమైక్య పాలనలోని చివరి ఏడాది 2013-14 సంవత్సరంలో వర్కర్స్‌కు రూ. 13,554 చొప్పున బోనస్ చెల్లిస్తే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గత అయిదేళ్లలో బోనస్ పెరుగుతూ వచ్చిందన్నారు. 2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369ను చెల్లించగా, ఈసారి లాభాల్లో వాటాను మరో శాతం పెంచి 28కి చేరుకుంది. లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00899 బోనస్‌గా అందుతుంది. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

English summary

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్, రూ.1 లక్ష బోనస్ | Telangana CM announces whopping Rs.1 lakh bonus for Singareni workers

Chief Minister K. Chandrasekhar Rao announced in the state legislative Assembly that each employee will get a bonus of Rs 1,00,899, which is Rs 40,530 more than the last year's bonus.
Story first published: Thursday, September 19, 2019, 17:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X