పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ దిగ్గజాలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు భారీ డిస్కౌంట్‌తో ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ ప్రారంభిస్తాయి. దసరా, దీపావళి ఫెస్టివెల్ సీజన్ నేపథ్యంలో అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫర్లు అందిస్తోంది. ఇతరులకు సెప్టెంబర్ 29 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 4 అర్దరాత్రి 12 గంటల వరకు సేల్ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్లపై 40% డిస్కౌంట్, రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్
గ్రేట్ ఇండియా ఫెస్టివెల్ సేల్ 2019లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, మొబైల్ విడిభాగాలపై నలభై శాతం వరకు రాయితీ ఇస్తోంది. ఎంపిక చేసిన మొబైళ్లపై అదనపు క్యాష్ బ్యాక్, రూ.6,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్, ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్, గృహోపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్
హోమ్ అప్లియెన్సెస్, టీవీలపై 70% వరకు డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ డోర్ డెలివరీ సదుపాయాన్ని అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్టులతో చెల్లింపులు చేసే వారికి 10% డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్, EMI సదుపాయాన్ని కల్పిస్తుంది. ఫెస్టివల్లో భాగంగా మొత్తం 20 కోట్లకు పైగా ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచుతోంది.

ఏ ఉత్పత్తులపై ఎంత శాతం తగ్గింపు?
అమెజాన్ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్ పైన 40 శాతం, 1200 టాప్ బ్రాండ్స్ ఫ్యాషన్ పైన 90 శాతం, 50,000 హోమ్, కిచెన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్, హోమ్ అప్లియెన్సెస్ పైన 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ వర్సెస్ అమెజాన్
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివెల్ సేల్ 2019 నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌ను సెప్టెంబర్ 29 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అక్టోబర్ 4వ తేదీన ఇది క్లోజ్ అవుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్ కన్న ముందే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ రెండు ఈ-కామర్స్ సైట్ల మధ్య పోటీ ఉండనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications