మాంద్యం... మాంద్యం... మాంద్యం. ఏమిటీ మాంద్యం. ఎందుకు ఇంతలా ప్రజలను భయపెడుతోంది. ఇండియా లో అసలు ఏం జరుగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత పదువుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఒత్తిడి అధికమవుతోంది. అలవికాని అమ్మకాల టార్గెట్లను పూర్తిచేయలేక, అసలు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని భయాలతో ఆందోళన చెందుతున్నారు. దీంతో, సీనియర్ లెవెల్ మానేజ్మెంట్ లు సైకియాట్రిస్ట్ లు, సైకాలజిస్ట్ లను సంప్రదిస్తున్నారు. బీపీ అధికవుతోందట. ఒత్తిడి నివారణ, బీపీ నియంత్రించే మందులకు గిరాకీ పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఒత్తిడి సంబంధిత రుగ్మతలతో తమ వద్దకు వస్తున్న పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. కాస్మోస్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ అధ్యయనంలో ఈ తరహా కేసులు మూడు రేట్లు పెరిగాయని ఈటీ వెల్లడించింది. కంపెనీల ఉద్యోగులకు హెల్త్ సంబంధిత కార్యక్రమాలు చేపట్టే మరో సంస్థ ఆప్టం ప్రకారం 2019 లో ఇలాంటి కేసులు 16% పెరిగాయని తెలిపింది. గతేడాది తో పోలిస్తే ఇవి రెట్టింపు అయ్యాయని పేర్కొంది.

కొంపముంచుతున్న నాలుగు అంశాలు...
ఉన్నతోద్యోగులే కాకుండా కీలక రంగాల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతున్నారు. అదే సమయంలో స్వయం ఉపాధి పొందుతున్న వారు, స్టార్టుప్ కంపెనీలను నెలకొల్పి వాటిని నడుపుతున్న వారు, వారి జీవిత భాగస్వాములు కూడా విపరీతమైన ఒత్తిడికి గుర్తున్నారు. వీరంతా ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాల గురించే ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక అభద్రత, ఉద్యోగం పోతుందన్న భయం, వ్యాపారంలో నష్టాల భయం, ఆర్థిక అనిశ్చితి. ఈ నాలుగు అంశాల్లో మరీ ముఖ్యంగా ఆర్థిక నష్టాలు సంభవించే క్రమంలో ఆత్మహత ఆలోచనలు కలుగుతున్నాయని పరిశోధనల్లో తేలుతోంది.

నియంత్రణల భయం...
దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఎన్ని ఇస్తున్నా... క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఆదాయ పన్ను శాఖ తో పాటు, వివిధ ప్రభుత్వ రంగాల నుంచి వేధింపులు అధికంగా ఉన్నాయని అటు ఉద్యోగులు, ఇటు వ్యాపార వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మరింత అధికం అయిందని వాపోతున్నారు. పన్నులను స్థిరీకరించటంతో పాటు, తక్కువ పన్నుల విధింపు లక్ష్యంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ... అమల్లో మాత్రం అందుకు విరుద్ధంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే... ఆర్థిక మాంద్యానికి కారణం కూడా అయిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంత ఆన్లైన్ లోనే జరుగుతున్నా... ఆడిట్లు, నోటీసుల పేరుతో అధికారుల వేధింపులు ఆగటం లేదని, ఇది తీవ్ర ఒత్తిడికి దారితీసే పరిణామమేనని నిపుణులు చెబుతున్నారు.

కాఫీ డే ఫౌండర్ ఉదంతం...
దాదాపు రూ 15,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న కాఫీ డే ఫౌండర్ వీ జీ సిద్ధార్థ... చివరకు ఆదయ పన్ను చెల్లింపు అధికారుల వేధింపులు, దానికి తోడు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడితో అర్థాంతరంగా తనువు చాలించారు. వేళ కోట్ల అప్పులు ఉన్నప్పటికీ... ఆస్తులు కూడా అందుకు తగ్గట్లే ఉన్నా... కేవలం ఒత్తిడిని నియంత్రించుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు అనుభవిస్తున్న అంతర్గత ఒత్తిడిని బహిర్గతం చేసి, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ విభాల ఒత్తిడి సెలబ్రిటీ స్థాయిలో ఉండే వారికే తప్పక పోతే, ఇక సామాన్యుల సంగతి ఏమిటి అని అందరూ ప్రశ్నించారు. 30,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పించిన ఒక పారిశ్రామిక వేత్త చివరకు తన తనువు చాలించేలా దేశంలోని పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నో రెమెడీ ....
బీపీ, ఒత్తిడి, మానసిక సంఘర్షణ, తీవ్ర ఆందోళన వంటి అంశాలకు తాత్కాలిక మందులు ఉన్నాయి కానీ... పూర్తి స్థాయి రెమెడీ ఏమీ లేదని డాక్టర్లు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ వారు దీని నుంచి బయట పడే ప్రయత్నం చేయాలనీ, ఒత్తిడిని సహజంగా నియంత్రించుకొంటూ... ప్రకృతి ద్వారా సాంత్వన పొందాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలం ఈ మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం పడుతుందని, అందుకే, యోగ, మెడిటేషన్ వంటి ఒత్తిడి నియంత్రిత పద్దులను అనుసరించాలని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా ఉద్యయం సహజంగానే అందరూ ఫిట్ గా ఉండాలన్న ఉద్దేశ్యం తో ప్రారంభిస్తున్నారు. కానీ... ఇప్పుడు దాని అవసరం ఉద్యోగులు, స్టార్టుప్ కంపెనీల ఫౌండర్లు, వారి కుటుంబాలు, పారిశ్రామికవేత్తలు అందరికి తప్పనిసరిగా ఉందని ఆర్థిక మాంద్యం నిరూపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications