మీకు ICICI బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఇది మీకోసమే... బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై అక్టోబర్ 16వ తేదీ నుంచి భారీ పెనాల్టీలు విధిస్తోంది. బ్యాంకుకు వెళ్లి క్యాష్ లావాదేవీలు నిర్వహిస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కు ఏకంగా రూ.100 నుంచి రూ.125 వరకు ఛార్జీ వసూలు చేయనుంది.

రూ.100 నుంచి రూ.125 ఛార్జ్
బ్యాంకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని ట్రాన్సాక్షన్లకు (ఒక్కో ట్రాన్సాక్షన్) రూ.100 ఛార్జ్ చేస్తారు. ఇది మొదటి రెండు ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుంది. తదుపరి ప్రతి లావాదేవీకి రూ.125 చార్జ్ చేస్తారు. బ్యాంకుకు వెళ్లి కస్టమర్లు అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రాలతో పాటు బ్యాంకు క్యాష్ డిపాజిట్ల పైన కూడా ఇదే రకమైన ఛార్జీలు వసూలు చేస్తుంది.

అందుకే.. ఎలాంటి చార్జీలు ఉండవద్దంటే..
తమ బ్యాంకు కస్టమర్లను డిజిటల్ ప్లాట్‌ఫాం దిశగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, తద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమానికి దోహదం చేస్తామని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉందని, అలాగే మొబైల్ బ్యాంకింగ్‌తో NEFT/RTGS/UPI ద్వారా కూడా ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బులు ట్రాన్సుఫర్ చేసుకోవచ్చునని తెలిపింది.

వీటిపై ఛార్జీలు రద్దు
డిజిటల్ ట్రాన్సాక్షన్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించి NEFT/RTGS/UPI ద్వారా చేసే ట్రాన్సాక్షన్ల పైన ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. వీటిపై ఇదివరకే అన్ని చార్జీలను రద్దు చేసింది.

బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవచ్చు
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు సవరించిన ఈ నిబంధనలు, షరతులు ఆమోదయోగ్యం కాకపోతే వారు దగ్గరలోని బ్రాంచీని సందర్శించి అక్టోబర్ 16వ తేదీలోగా సేవింగ్స్ అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. మీ ఖాతా

బ్యాంకు ఖాతా క్లోజ్ చేసే వరకు నిబంధనలు
ఎవరైనా తమ ఖాతాను మూసివేయాలనుకుంటే కూడా దగ్గరలోని బ్యాంకును సందర్శించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా క్లోజ్ అయ్యే వరకు సవరించిన నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

బ్యాంకుకు వెళ్లి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఉపయోగిస్తే...
ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి నెఫ్ట్ సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచీల్లో నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు రూ.2.25 నుంచి రూ.24.75 వరకు ఉంది. ఆర్టీజీఎస్ లావాదేవీల ఛార్జీలు రూ.20 నుంచి రూ.45 వరకు ఉంది. జీఎస్టీ అదనం.


Click it and Unblock the Notifications