ఢిల్లీ: ప్రపంచంలోని సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన 30 మంది ప్రముఖుల్లో ఒకరైన ఇన్‌స్టాగ్రామ్ కింగ్ డాన్ బిల్జేరియన్ భారతదేశాన్ని సందర్శించారు. విలాసవంతమైన జీవనశైలి, పోకర్ చాంప్‌గా, ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌కు ఇతను సుపరిచితుడు. అతను ముంబై, ఢిల్లీలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను తన చేతికి పెట్టుకున్న వాచ్ అందరినీ ఆకట్టుకుంది.

డాన్ బిల్జేరియన్ ధరించిన వాచీ ఖరీదు తెలిస్తే షాకవుతారు
ఆయన తన ఆడంబరశైలితో ఇక్కడా అలరించారు. డాన్ బిల్జేరియన్ V-నెక్ షర్ట్, తెల్లను షూస్, నారింజ రంగులోని షార్ట్ ధరించాడు. అయితే ఆయన నలుపు, నారింజ కలర్ కలిగిన వాచీ కూడా ధరించారు. ఈ వాచీ ఖరీదు ఎంతో తెలిస్తే అందరూ షాకవడం ఖాయం.

ఖరీదైన వాచీ.. పరిమిత ఉత్పత్తి
డాన్ బిల్జేరియన్ రిచర్డ్ మిల్లే ఆర్ఎం11-03 వాచీనీ ధరించాడు. దీనిని మెక్ లారెన్‌కు చెందిన ఇంజినీర్స్, డిజైనర్స్‌తో కలిసి రూపొందించిన వాచ్ ఇది. దీనిని 2018లో జెనీవాలో ఇంటర్నేషనల్ మోటార్ షోలో లాంచ్ చేసారు. ఈ వాచీల ఉత్పత్తి కేవలం 500కు మాత్రమే పరిమితం.

ఊహించని దాని కంటే ఖరీదైనది.. కారు కొంటేనే..
దీంతో సహజంగా ఈ వాచీ చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. అయితే ఇది మీరు ఊహించిన దాని కంటే చాలా చాలా ఖరీదు. ఈ వాచీనీ లాంచ్ చేసిన సమయంలో రెగ్యులర్ కస్టమర్లకు విక్రయించలేదు. మెక్ లారెన్ సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. సెన్నా, స్పీడ్‌టెయిల్, P1 వంటి హైపర్ కార్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

వాచీ ఖరీదు రూ.1 కోటికి పైగా..
ఇలాంటి వాచీ ఖరీదు ఎంతో తెలుసా? 191,500 డాలర్లు. అంటే మన రూపాయల్లో అక్షరాలా రూ.1,36,00,000. అయితే ఈ వాచీల ఉత్పత్తి పరిమితం. కాబట్టి వీటి వ్యాల్యూ కూడా పెరిగింది. వీటిని కొనుగోలు చేసిన వారు తిరిగి దానిని రూ.2.5 కోట్లకు విక్రయిస్తున్నారట.

విల్లా కంటే ఖరీదైన వాచ్
ఈ వాచీ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మెక్ లారెన్స్ కారు వీల్ షేప్‌లో ఇది ఉంటుంది. ఇలాంటి అత్యంత ఖరీదైన వాచీతో డాన్ బిల్జేరియన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చెప్పాలంటే ఈ వాచీ ఖరీదు ఓ విల్లా కంటే చాలా ఎక్కువే. మరోవైపు పరిమిత ఉత్పత్తి నేపథ్యంలో దీనిని ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications