2020 జనవరి నుంచి కొత్తగా నమోదయ్యే డీలర్లకు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ శనివారం నాడు జీఎస్టీఎన్ (జీఎస్టీ నెట్ వర్క్) నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొందరు అక్రమార్కులు జీఎస్టీ డీర్లమని చెప్పుకుంటూ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి లబ్ధి పొందుతున్నారని జీఎస్టీఎన్ మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ అన్నారు. ప్రస్తుతం ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరిగా లేదు. ఈ ప్రాజెక్టును ఇన్ఫోసిస్‌కు అప్పగించారు.
చదవండి: గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు

అక్రమాలకు చెక్
జీఎస్టీ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 'కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే డీలర్లకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి దీనిని తప్పనిసరి చేస్తున్నాం. ఎందుకంటే, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే వాళ్లు చాలామంది జీఎస్టీ డీలర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ రశీదులు కూడా సృష్టించారు' అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు.

ఆధార్ ధ్రువీకరణ లేదా భౌతిక తనిఖీ
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త డీలర్లకు ఆధార్ ధ్రువీకరణ లేదా భౌతిక తనిఖీ తప్పనిసరి అన్నారు. ఆధార్ వివరాలు సమర్పించని పక్షంలో భౌతిక తనిఖీ జరుగుతుందని తెలిపారు. ఇంతకుముందు ఇది స్వచ్చంధంగా ఉండేదని, చాలామంది తప్పుడు మార్గాల ద్వారా వాళ్లంతట వాళ్లే జీఎస్టీ డీలర్లగా అవతరిస్తున్నారనిగత రెండేళ్లలో గుర్తించినట్లు చెప్పారు. వాళ్లు నకిలీ రసీదులు సృష్టిస్తున్నారన్నారు.

అందరికీ వర్తింప చేస్తారు..
అంటే వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త డీలర్లకు ఆధార్ లేదా వ్యక్తిగత గుర్తింపు పరిశీలన (ఫిజికల్ వెరిఫికేషన్) తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించి సాఫ్టువేర్, ప్రోగ్రామింగ్ రూపకల్పన బాధ్యతను ఇన్ఫోసిస్‌కు అప్పగించారు. ఎవరైనా ఆధార్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకుంటే వాళ్లకు వ్యక్తి గుర్తింపు పరిశీలన ఉంటుంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండు పద్ధతుల్లో కూడా పరిశీలన తర్వాత మూడు పని దినాల్లో జీఎస్టీ గుర్తింపు సంఖ్యను జీఎస్టీఎన్ జారీ చేస్తుంది. మొదటి దశలో కొత్త డీలర్లకు ఆధార్ తప్పనిసరి చేసి, ఆ తర్వాత జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునే అందరికీ దీనిని వర్తింప చేస్తారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి రీఫండ్స్ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ ద్వారా జరుగుతుందని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications