న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వస్తున్నారు. ఆటో రంగం తీవ్ర మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా దారుణంగా పడిపోయాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఈ రోజు (సెప్టెంబర్ 14) కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి నిర్మల ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
వృద్ధి చర్యల కోసం ఆమె ప్రకటన చేయనున్నారు. అలాగే, ఇటీవల వివిధ రంగాల ప్రతినిధులతో ఆమె భేటీ అయి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశముంది. అంతకుముందు రెండు శుక్రవారాలు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. నిర్మలా సీతారామన్ వివిధ సెక్టార్‌లకు సంబంధించి నిర్దిష్ట పరిష్కారాలు, లక్ష్యాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

గృహ నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగ వృద్ధిని పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. కానీ ప్రస్తుతం నిర్మాణ రంగంలో అంత కదలిక లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో సేల్స్ భారీగా పడిపోయాయి.
అంతర్గత ఎకానమీకి తోడు అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం కూడా మన మార్కెట్లపై పడుతోంది. ప్రపంచంలోను ఆర్థిక మాంద్య భయం నెలకొనడం భారత్‌కు మరింత ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications