For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!

|

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం అంశంలో మరో అడుగు ముందుకు పడింది. స్విస్ బ్యాంకుల్లో అక్రమ ఖాతాలు ఉన్న భారతీయుల వివరాలను ఈ నెలలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందిస్తోంది. తొలి విడతగా అందిన వివరాల్లో ఇప్పటికే మూసివేసిన ఖాతాల వివరాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఖాతాల సమాచారం కోసం రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో చాలామంది ఇండియన్స్ తమ అకౌంట్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు 2018లో ప్రకటించారు. తమ గుట్టు రట్టవుతుందని వీరు క్లోజ్ చేసినట్లు స్విస్ అధికారులు తెలిపారు.

ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!

స్విస్ బ్యాంకు చిట్టా అందింది..

స్విస్ బ్యాంకు చిట్టా అందింది..

స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్నవారి సమాచారం ఇప్పటికే భారత ప్రభుత్వానికి చేరింది. అక్రమంగా ధనం తరలించినవారిపై బలమైన కేసులు నమోదు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. తొలివిడతలో క్లోజ్ అయిన ఖాతాలో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తమపై చర్యలు తీసుకుంటారనే ఆందోళనతో ఈ ఖాతాలను 2018లో క్లోజ్ చేశారు. అదేవిధంగా చాలా ఖాతాల్లోని సొమ్ము ముందుగా ఇతర ప్రాంతాలకు తరలి పోయింది.

ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్

ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్

ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోవాలన్న విధానం కింద (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) గత నెల చివరివారంలో స్విస్ ఇటీవలే ఈ సమాచారాన్ని భారత్‌కు పంపించింది. గత నెల చివరి వారంలో సమాచారం పంచుకునే విధివిధానాలపై ఇరుదేశాల అధికారులు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడి బ్యాంకులు 2018లో ఒక్కరోజు పాటు లావాదేవీలు జరిగిన అకౌంట్స్ సహా అన్ని అకౌంట్స్ వివరాలు సేకరించి నివేదికను రూపొందించాయి.

ముందే క్లోజ్ చేశారు...

ముందే క్లోజ్ చేశారు...

ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న భారతీయులు సహా చాలామంది వ్యాపారులకు చెందిన సమాచారమే వచ్చిందని తెలుస్తోంది. గత ఏడాది కంటే ముందు క్లోజ్ చేసిన వందమంది వరకు ఇండియన్స్ అకౌంట్ వివరాలు అందాయని చెబుతున్నారు. ఎక్కువగా ఆటో మొబైల్, రసాయనాలు, వస్త్రాలు, వజ్రాలు, నగలు, ఉక్కు తదితర వ్యాపారాలు చేసిన వారేనని చెబుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు..

రహస్యంగా ఉంచాలనే నిబంధన పైనే...

రహస్యంగా ఉంచాలనే నిబంధన పైనే...

వివరాలను రహస్యంగా ఉంచాలనే షరతుపై సమాచారం అందించారు. ఈ పేర్లు బయటపెట్టరాదనే షరతు మీద స్విస్ ప్రభుత్వం డాటా ఇచ్చేందుకు అంగీకరించింది. అధికారికంగా భారతీయులుగా గుర్తింపు పొందిన వారి పేర్ల మీద ఉన్న అకౌంట్స్, వ్యాపారం ఇతర న్యాయమైన వ్యవహారాల కోసం ఉపయోగించిన అకౌంట్స్‌ను మాత్రమే పంపిస్తుంది. భారతీయుడి అకౌంట్‌కు సంబంధించిన వివరాలను స్విస్ బ్యాంకు మొదట స్విస్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఆ వివరాలను ప్రభుత్వం ఇండియాకు అందిస్తుంది.

ఎవరి పేరు మీద.. జమ అయిన మొత్తం...

ఎవరి పేరు మీద.. జమ అయిన మొత్తం...

స్విస్ బ్యాంకుల్లో ఈ అకౌంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయనే వివరాలను, జమ అయిన మొత్తాలను భారత్‌కు స్విస్ ప్రభుత్వం అందిస్తోంది. ఖాతాదారుని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధారంగా వ్యక్తులను గుర్తిస్తారు. బ్యాంకు ఖాతా నెంబర్, సంబంధిత బ్యాంకు చిరునామా, ఇతర సమాచారం ఉంటుంది. జమ చేయబడిన వడ్డీ, డివిడెండ్స్, బీమా పాలసీల ద్వారా వచ్చిన ఆదాయం, క్రెడిట్ బ్యాలెన్స్, ఆర్థిక ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం, ఇతరత్రా ఆదాయం వివరాలు ఉంటాయి.

English summary

Swiss banks to provide details of Indian accounts to government

As India prepares to analyse troves of Swiss banking details of its citizens, a large portion of the first tranche of data being shared by Switzerland under an automatic exchange of information (AEOI) framework this month relates to accounts that have been already closed due to fear of action, bankers and regulatory officials said.
Story first published: Monday, September 9, 2019, 9:07 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more