21 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ఆటోమొబైల్ సేల్స్

భారత్‌లో ఆటోమొబైల్ సేల్స్ గత ఆగస్ట్ నెలలో భారీగా తగ్గిపోయాయి. టూవీలర్, పాసింజర్ వెహికిల్స్ సహా అన్ని సెగ్మెంట్ వాహనాల విక్రయాలు తగ్గిపోయాయి. ఆటో పరిశ్రమ పూర్తిగా తిరోగమనంలో ఉందని ఆటో ఇండస్ట్రీ బాడీ SIAM సోమవారం నాడు వెల్లడించింది. SIAM 1997-98 నుంచి హోల్ సేల్ వెహికిల్స్ సేల్ రికార్డ్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి.

ఈ డేటా ప్రకారం టూ వీలర్, పాసింజర్ వెహికిల్స్ సహా 2018 ఆగస్ట్‌లో సేల్స్ 23,82,436 ఉండగా, ఇది ప్రస్తుత ఆగస్టు నెలలో 18,21,490గా ఉంది. 23.55 శాతం సేల్స్ తగ్గాయి.

Automobile sales in India see the worst ever fall in 21 years

జూలై నెలలో 19 శాతం వాహన సేల్స్ తగ్గి, ఇవి 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2018 జూలై నెలలో ఈ సేల్స్ 22,45,223 ఉండగా, ఈ ఏడాది జూలైలో మాత్రం 18.71 శాతం తగ్గి 18,25,148గా ఉన్నాయి.

అలాగే డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ ఆగస్ట్ నెలలో 31.57 శాతం తగ్గి గత ఆగస్టులో 2,87,198 నుంచి ఈ ఆగస్టులో 1,96,524 తగ్గిపోయాయి. ఇవే వెహికిల్ సేల్స్ గత ఏడాది జూలై కంటే ఈ ఏడాది జూలైలో 30.98 శాతం పడిపోయి 2,00,790 యునిట్ల మాత్రమే సేల్ అయ్యాయి. ఈ ఆగస్ట్ నెలతో పాసింజర్ వెహికిల్స్ సేల్స్ పడిపోవడం వరుసగా పదో నెల. అయితే అన్ని వెహికిల్స్ సేల్స్ కూడా ఈ ఆగస్టులో పడిపోయాయి.

ఆగస్ట్ నెలలో మారుతీ సుజుకీ ఇండియా పాసింజర్ వెహికిల్ సేల్స్ 36.14 శాతం పడిపోయి 93,173 వద్ద నిలిచాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్స్ 16.58 శాతం పడిపోయి 38,205 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 31.58 శాతం తగ్గి 13,504 యూనిట్లకు పడిపోయాయి.

ఈ ఆగస్ట్ నెలలో పాసింజర్ వెహికిల్స్ సేల్స్ దారుణంగా పడిపోయాయని SIAM తెలిపింది. అంతకుముందు నెలలో డొమెస్టిక్ కారు సేల్స్ 41.09 శాతం పడిపోయి 1,15,957 యూనిట్లకు తగ్గాయి. 2018 ఆగస్టులో ఈ సేల్స్ 1,96,847 యూనిట్లుగా ఉన్నాయి.

గత నెలలో టూ వీలర్ సేల్స్ 22.24 శాతం పడిపోయాయి. అంతకుముందు ఏడాదిలో ఈ సేల్స్ 19,47,304 యూనిట్లు కాగా ఈ ఏడాది 15,14,196కు పడిపోయాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 38.71 శాతం పడిపోయాయి. 2018 ఆగస్ట్ నెలలో 84,668 యూనిట్స్ సేల్ కాగా ఈ ఆగస్టులో 51,897కు పడిపోయాయి.

2018 ఆగస్ట్ నెలలో మోటార్ సైకిల్ సేల్స్ 12,07,005 యూనిట్లు కాగా ఈ ఆగస్టుకు 22.33 శాతం తగ్గి 9,37,486 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ సేల్స్ 22.19 శాతం తగ్గి 6,69,416 యూనిట్ల నుంచి 5,20,898 యూనిట్స్‌కు తగ్గాయి.

టూ-వీలర్ కేటగిరీలో హీరో మోటార్ కార్ప్ సేల్స్ 20.97 శాతం పడిపోయి 5,24,003 యూనిట్లుగా ఉన్నాయి. హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా సేల్స్ 26.26 శాతం తగ్గి 425664 యూనిట్లకు పడిపోయాయి.

చెన్నై బేస్డ్ టీవీఎస్ మోటార్ కో సేల్స్ 20.37 శాతం తగ్గి 2,19,528 పడిపోయాయి. SIAM డేటా ప్రకారం ఆటోమొబైల్ సేల్స్ ఆగస్ట్ 2018లో 16,69,751 ఉండగా 4.15 శాతం తగ్గి 16,00,376 పడిపోయాయి. అలాగే పాసింజర్ వెహికిల్ సేల్స్ గత ఏడాది 2,56,662యూనిట్లు కాగా 7.13 శాతం తగ్గి ఈ ఆగస్టులో 2,38,357గా ఉన్నాయి. టూ-వీలర్ సేల్స్ 12,86,176 ఉండగా ఈ ఏడాది ఆగస్టులో 3.4 శాతం తగ్గి 12,42,452కు పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+