చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్ బిజినెస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తన UCWeb ద్వారా ఇక్కడ అడుగు పెట్టనుందని గురువారం ఓ సీనియర్ అధికారి వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పేటీఎంకు పోటీగా రావడం లేదని చెబుతున్నారు. పేటీఎంలో (30.15 శాతం)అలీ బాబా గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి, స్నాప్‌డీల్‌లోను 3 శాతం వాటా ఉంది.

భారత్‌కు అలీబాబా
అలీబాబా గ్రూప్‌కు ఈ-కామర్స్ బిజినెస్‌కు విడదీయరాని సంబంధం ఉందని, వాస్తవానికి ఈ-కామర్స్‌కు సంబంధించి వినూత్న వ్యాపార సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ సంవత్సరం భారత్‌లో కొత్త ఈ-కామర్స్ ఉత్పత్తిని ప్రారంభించబోతున్నామని అలీబాబా ఫిలాంథ్రపీ ఫోరమ్‌కు సంబంధించిన వారు వెల్లడించారట.

ఆన్‌లైన్ విస్తారమైనది...
ఈ కామర్స్ బిజినెస్ అనేది చాలా విస్తారమైనదని, వివిధ రకాల ఈ-కామర్స్ బిజినెస్‌లు, వేర్వేరు ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు. మాకు ఎలాంటి వ్యాపారం సూట్ అవుతుందనేది యూసీ ఎంచుకుంటుందన్నారు. తమ వ్యాపారానికి అనుగుణమైన విభాగాన్ని ఎంచుకుంటామని, అలాగే ఆన్‌లైన్ మూవీ టిక్కెటింగ్ సేవల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందని చెబుతున్నారు. సరైన కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని, అలాగే, పేటీఎంతో పోటీ లేదని వెల్లడించారు.

అలీబాబా గ్రూప్...
అలీబాబా గ్రూప్ ఎప్పటి నుంచో భారత్ పైన దృష్టి సారించింది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. గత మే నెలలో ఈ గ్రూప్‌కు చెందిన టెక్నాలజీ గ్రూప్ VMateలో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇది యూసీ వెబ్ విడుదల చేసిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్. భారత మార్కెట్లోని లాభధాయక సోషల్ మీడియాలోకి మరింత చొచ్చుకొస్తోంది.

ఇలా ప్లాన్...
మీడియాలో వస్తున్న వార్తల మేరకు పెరుగుతున్న సోషల్ మీడియా వీడియో యాప్ మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలనుకుంటోంది. వేగంగా పెరుగుతున్న ఇండియన్ మార్కెట్లో VMateతో ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తామని భావిస్తోంది. అలీబాబా గ్రూప్ క్లౌడ్ కంప్యూటింగ్ పైన కూడా భారత్‌లో దృష్టి సారించిందట.

యూసీ బ్రౌజర్
ఇండియాలో UC బ్రౌజర్ 2009 నుంచి అందుబాటులో ఉంది. చైనాను మినహాయిస్తే ఈ బ్రౌజర్‌ను ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో దాదాపు సగం భారత్ నుంచి ఉన్నాయి. దేశంలో 130 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నట్లు యూసీ బ్రౌజర్ ప్రకటించింది.

ఆన్‌లైన్‌లో గట్టి పోటీ
అలీబాబా రంగ ప్రవేశంతో ఇండియా ఈ కామర్స్‌లో పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్, అమెజాన్ మధ్య గట్టి పోటీ ఉంది. పేటీఎం మాల్, స్నాప్‌డీల్ కూడా ఆన్‌లైన్ మార్కెట్‌పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ-కామర్స్‌లోకి వస్తున్నారు. అలీబాబా కూడ వస్తే గట్టి పోటీ ఉండనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications