న్యూఢిల్లీ: భారత నిరుద్యోగం ఆగస్ట్ నెలలో 8.4 శాతంతో మూడేళ్ల గరిష్టానికి చేరుకుందని CMIE (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) వెల్లడించింది. ఆగస్ట్ 2019లో వీక్లీ అన్‌ఎంప్లాయిమెంట్ గ్రోత్ 8 నుంచి 9 శాతం మధ్య ఉంది. అదే సమయంలో జూలై నెలలో ఇది 7-8 శాతం మధ్య ఉంది. ఈ మేరకు బుధవారం రిపోర్ట్‌లో వెల్లడించింది. 2016 సెప్టెంబర్ తర్వాత ఇంత నిరుద్యోగ శాతం కలిగి ఉండటం ఇదే మొదటిసారి అని వెల్లడించింది.
CMIE నివేదిక ప్రకారం అర్బన్‌లో నిరుద్యోగం శాతం 9.6గా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.8 శాతంగా ఉంది. 2018 ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈ ఆగస్ట్ నెలలో 2 శాతం పెరిగింది. గ్రామీణ భారతంలో సంవత్సరానికి ఉపాధి వృద్ధి 2019 ఆగస్టులో 2.9 శాతంగా ఉండగా, పట్టణ భారతదేశంలో 0.2 శాతం క్షీణించింది.

నిరుద్యోగత పెరగడానికి లేబర్ పార్టిసిపేషన్ రేట్ కూడా ఓ కారణం. 2018 అక్టోబర్ నెలలో ఇది 42.46 శాతంగా ఉండగా 2019 ఆగస్ట్ నాటికి 43.35 శాతంగా ఉంది. కార్మిక భాగస్వామ్య రేటు పెరుగుదల ఆరోగ్యకరమైన సందేశమని, ఉద్యోగాలు పొందగలరని చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొంది.
ఇప్పటికే గత కొన్నాళ్లుగా ఆటో సేల్స్ తగ్గడంతో వెహికిల్ మేకింగ్ కంపెనీలు తాత్కాలికంగా తమ ప్లాంట్లను మూసివేశాయి. డీలర్లు షాప్స్ క్లోజ్ చేసారు. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారు. దీంతో ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరోవైపు ఎఫ్ఎంసీజీ రంగంలోను వృద్ధి మందగించింది. రియాల్టీ రంగం ఆశించిన మేర పుంజుకోలేదు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications