హాంగ్‌కాంగ్‌లో నిరసనకారుల పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. అనుమానిత నేరస్థుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా జూలైలో మొదలైన ఉద్యమానికి ఇప్పటికీ ఫుల్‌స్టాప్ పడలేదు. హాంగ్‌కాంగ్‌లో చైనా జోక్యాన్ని అక్కడి వారు తప్పుబడుతున్నారు. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఈ నిరసనలు భారత్‌లోని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎందుకంటే జ్యువెల్లరీ వ్యాపారంలో భారత్‌కు హాంగ్‌కాంగ్ అతిపెద్ద మార్కెట్.
భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన హాంగ్‌కాంగ్‌కు జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ ఆభరణాల రవాణా ఏప్రిల్‌తో ప్రారంభమైన మొదటి నాలుగు నెలల్లో 6.6 శాతం తగ్గి 3.2 బిలియన్ డాలర్ల వద్ద ఉందని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సెల్ తెలిపింది. హాంగ్‌కాంగ్‌లో నిరసనలు ఇలాగే కొనసాగితే మరింత పడిపోతుందని ట్రేడ్ మినిస్ట్రీ బ్యాక్డ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సభ్యసాచి రే అన్నారు.

హాంగ్‌కాంగ్‌కు రవాణా అయ్యే జెమ్స్ అండ్ జ్యువెల్లరీల్లో భారత్ మార్కెట్ మూడొంతులు. ఇప్పటికే అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం తగ్గి 11.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సేల్స్ పడిపోయాయి.
హాంగ్‌కాంగ్‌లో నిరసనలు దాదాపు మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. అనుమానిత నేరస్థుల అప్పగింతను ఇక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. హాంగ్‌కాంగ్‌లో చైనా జోక్యాన్ని అక్కడి వారు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. నిరసనల కారణంగా దీనిని అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు. నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసురుతున్నారు.
నిరసనలు ఇలాగే కొనసాగితే హాంగ్‌కాంగ్‌లో మాంద్యం ప్రభావానికి గురవుతుంది. ఇప్పటికే అమెరికా - చైనా ట్రేడ్ వార్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉంది. చైనా నుంచి పర్యాటకులు తగ్గడం, బంగారం ధరలు పెరగడం వంటివి ఈ నగరం రిటైల్ ఆభరణాల సేల్స్‌ను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. హాంగ్‌కాంగ్ ట్రేడ్ ఫేర్‌కు పర్యాటకులు తగ్గడం భారత ఎగుమతులను ప్రభావితం చేస్తోందని సభ్యసాచి రే అన్నారు.
ట్రేడ్ ఫేర్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు జరగనుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత నెలలో సేల్స్ తగ్గాయని రష్యన్ డైమండ్ ప్రొడ్యూసర్ అల్రోసా పీజేఎస్సీ డైరెక్టర్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం ట్రేడ్ ఫేర్ ఉంటుందని ఇప్పటి వరకు భావిస్తున్నారు. ఈ ఫేర్‌లో పాల్గొనేందుకు దాదాపు 100 మంది ఎగ్జిబిటర్స్ చెల్లింపులు జరిపారు. అక్కడకు వెళ్లలేని పరిస్థితుల్లో పరిహారం చెల్లింపుపై చర్చలు జరుపుతున్నారట.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications