ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం వంటి వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఆశించినట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మందగమనంతో పోలిస్తే భారత్ పరిస్థితి ఒకింత బాగానే ఉందంటున్నారు. ఈ అంశంపై యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సెల్ (USIBC) నిషా దేశాయి బిస్వాల్ స్పందించారు.

మోడీ రాకపై ఆసక్తి....
ప్రస్తుతం భారత్ తన విజన్‌ను ముందుంచాలని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకొని ఉందని, ఇలాంటి సమయంలో భారత్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలనే అంశంపై భారత్ విజన్‌ను ప్రదర్శించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని వచ్చి ఏం చెబుతారనే దానిపై USIBC సభ్యులు ఆసక్తితో ఉన్నారని చెప్పారు.

ఇన్వెస్టర్లకు విశ్వాసం
ఇటీవల బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, భారత్‌ను తిరిగి బలమైన వృద్ధిలోకి తీసుకు రావడం కోసం మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు.

సవాళ్లను అవకాశంగా చూడాలి...
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నదని మీడియాలో వస్తున్న వార్తలపై కూడా బిస్వాల్ స్పందించారు. ఇలాంటి సవాళ్లను అవకాశంగా చూడాలని అభిప్రాయపడ్డారు.

మోడీ సాహసోపేత నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, అతని బోల్డ్ నిర్ణయాల వల్ల వృద్ధిపై ఆశలు ఉన్నాయని చెప్పారు. భారత్ మరింత బలంగా తయారవుతుందన్నారు.

రానున్న 12 నెలలు క్లిష్టమైనది.. ఇండియాకు బెనిఫిట్
రానున్న 12 నెలల కాలం చాలా క్లిష్టమైనదని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూకే బ్రెగ్జిట్ పైన దృష్టి సారించిందని, ఇది యూకే ఎకానమీపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అలాగే, ఇతర మార్కెట్లలో కూడా ఆర్థిక అనిశ్చితులు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లు భారత్‌కు ప్రయోజనమే అన్నారు. మరిన్ని సంస్కరణలు చేపట్టాలన్నారు.

ఏం చేస్తున్నామో.. భారత్ చెప్పాలి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో ఇక్కడ (భారత్) మనం ఏం చేస్తున్నామని చెప్పడం తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షించేందుకు భారత్‌కు మంచి అవకాశముందని చెప్పారు. భారత పాలసీలలో కొన్ని రక్షణాత్మక అంశాలను పరిశీలించవచ్చునన్నారు.

నిర్మలా సీతారామన్ సంస్కరణలకు ప్రశంస
ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. ఇది FDI పరిష్కారమని, అలాగే భారత్ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. అయితే పెట్టుబడిదారులు ఆర్థిక విధానాల స్థిరత్వం కోసం వెతుకుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిరత్వం ఉన్నందున ఇన్వెస్టర్లు సురక్షిత దిశగా దృష్టి సారించారన్నారు. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో భారత్ ఇందుకు సంబంధించి మార్గనిర్దేశనం చేసే బలమైన, స్థిరమైన పాలసీలను రూపొందించాల్సిన అవసరముందన్నారు.

భరోసా ఇచ్చేలా..
ప్రభుత్వం సంస్కరణలు ఒక దాంతో మరొకదానికి ఇబ్బంది లేకుండా చూసేలా ఉండాలని చెప్పారు. ఆ విధాన స్థిరత్వం, పొందిక పెట్టుబడిదారులకు భరోసా ఇస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకోవడం ద్వారా లాంగ్ టర్మ్‌లో మార్కెట్లో భారత్ పోటీలో నిలదొక్కుకుంటుందన్నారు.

ఇదో బిగ్ స్టెప్
తాము అక్కడ లేనప్పటికీ రెండు వారాలుగా కొన్ని కీలక సానుకూల ప్రకటనలు ప్రభుత్వం నుంచి వెలువడ్డాయని బిస్వాల్ అన్నారు. దేశీయ ఎగుమతి ఆధారిత వృద్ధిని పెంపొందించే సమయం అసన్నమైందని చెప్పారు. సరళీకృత వాణిజ్య విధానం ద్వారా భారత్ లాభపడుతుందని చెప్పారు. ఇటీవల లోకల్ కంటెంట్ నిబంధనలను సడలించిందని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరింగ్‌లో 100 శాతం FDIలను అనుమతించిందని, ఇది చాలా బిగ్ స్టెప్ అన్నారు.
More From GoodReturns

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications