2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ పైన 8.65 శాతంగా నిర్ణయిస్తూ క్వపవో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరిస్తుందని ఆ శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ శుక్రవారం చెప్పారు. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిపై నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 6కోట్ల మంది పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు లబ్ది చేకూరనుందన్నారు. పీఎఫ్ పైన 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ విభేదించడం లేదని స్పష్టం చేశారు. గత ఫిబ్రవరి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి వడ్డీని పెంచాలని నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయగా, ఆర్ధిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) ఏప్రిల్ నెలలో (2018-19)సంవత్సరానికి పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కార్మిక శాఖ, ఆదాయ పన్ను శాఖనోటిఫై చేయాల్సి ఉంది. అనంతరం పీఎఫ్ అకౌంట్లలో వడ్డీని జమ చేస్తారు. ఖాతా దారులకు ఇప్పుడు 8.55శాతం వడ్డీ లభిస్తోంది.
ఈపీఎఫ్ లెక్క ప్రకారం 8.65 శాతం వడ్డీని చెల్లిస్తే రూ.151.67 కోట్ల మిగులు ధనం ఉంటుంది. 8.70 శాతం ఇస్తే 158 కోట్ల ద్రవ్యలోటును సంస్థ భరించవలసి ఉంటుంది. అందుకే 2018-19కి గాను 8.65 శాతం వడ్డీని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications