సామాన్యుల నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వరకు, ఆటోమొబైల్ రంగం నుంచి ఎఫ్ సీజీ వరకు, మార్కెట్ పండితుల నుంచి ఆర్థిక విశ్లేషకుల వరకు అందరూ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంభందించిన వివరాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో చరవేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అదే స్థాయిలో ఉంటుందా లేక కుంటి నడక నడుస్తుందా అనే సమాచారం తెలుసుకోవడానికి సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
మన దేశం మంచి వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆటో మొబైల్ రంగం అమ్మకాలు లేక కుయ్యోమొర్రో అంటోంది.
ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి చాలా కంపెనీలు. ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డుమీద పడినవారు హాహాకారాలు చేస్తున్నారు. ఎఫ్ ఎం సీజీ రంగం పరిస్థితి అదేవిధంగా ఉంది. జనాలు కనీసం పది రూపాయల బిస్కెట్ కొనుగోలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. మరీ ఇంత దారుణమా ... బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి డబ్బులు లేవా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి కంపెనీలు .
మీరు కారు, బిస్కెట్ ప్యాకెట్ కొనకపోవడం వల్లనే ఇక్కడ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తయారీ రంగం పడకేసింది. మౌలిక పరిశ్రమల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. వ్యవసాయం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేనే లేదు. ఈ రంగాన్ని చాలా మంది మరచి పోతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి నగదు బదిలీ చేస్తున్నా పంటలు మాత్రం పెరగడం లేదు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందడం లేదు మరి.

వినియోగం, పెట్టుబడుల దెబ్బ
మనం అనుకుంటాం కానీ ఆర్థిక వ్యవస్థలో ఒకదానితో ఒకదానికి లింకు ఉంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా ఈ లింక్ గల్లంతు అవుతుంది. ఉదాహరణకు... బిస్కెట్ల విషయానికి వస్తే బిస్కెట్లకు అవసరమైన ముడిసరుకులను సేకరించి ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. వినియోగదారుడు కొనుగోలు చేయకపోతే మొత్తం ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పుడు వినియోగదారు అనేక రకాల ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్నారు. తమకు వస్తున్నా ఆదాయాన్ని ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. అందుకే వినియోగం తగ్గి పోతోంది. దీని వల్ల కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. వినియోగం లేకపోతే కంపెనీలు కొత్త ఉత్పత్తులు తీసుకురావడానికి వెనుకాడుతాయి. విస్తరణను నిలిపివేస్తాయి. కొత్త ఉద్యోగాల కల్పనా ఉండదు. ఉద్యోగం లేకపోతే ఆదాయం ఉండదు. ఆదాయం లేకపోతే కొనుగోళ్లు ఉండవు. ఇలా ఒకదానితో ఒకదానికి లింక్ ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో వినియోగం బాగా తగ్గిపోయింది. అదేవిధంగా ప్రయివేట్ పెట్టుబడులు కూడా తక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావం ఆర్ధిక వ్యవస్థలోని రంగాలపై కనిపిస్తోంది.

జీడీపీ వృద్ధి అంత అవసరమా ?
జీడీపీ లో వృద్ధి అంత అవసరమా.. ప్రభుత్వం, విశ్లేషకులు పదే పదే జీడీపీ గురించి వల్లే వేస్తున్నారు అని చాలా మంది అనుకుంటారు. అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరిగితేనే జీడీపీ పెరుగు తుంది. ఒక శాతం జీడీపీ పెరిగితే లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. వారి వల్ల మరికొందరికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అందుకే జీడీపీ వృద్ధికి ప్రాధాన్యం.

ఆర్బీఐ, ప్రభుత్వం చర్యలు..
దేశ జీడీపీ లో వృద్ధి రేటును పెంచడానికి అటు భారత రిజర్వ్ బ్యాంకు ఇటు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్బీఐ తన వంతుగా వరుసగా నాలుగు సార్లు రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గింపు వల్ల బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. దీనితో రుణాలు తీసుకునే వారు పెరుగుతున్నారు. రుణం తీసుకున్నవారు దేనికో ఒకదానికి ఖర్చు చేస్తారు. దానివల్ల సంబంధిత రంగంలో కార్యకలాపాలు పెరిగి ఆ రంగం వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది.
ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం భాద్యత. అందుకే ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. వినియోగవృద్దికి ప్రాధాన్యం ఇస్తుంది. పెట్టుబడులకు అవసరమైన సొమ్మును సమీకరించుకుంటుంది.

ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్లు
ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే ఆర్బీఐ నుంచి రూ.1.76 లక్షల కోట్లు అందుతున్నాయి. ఈ మొత్తాన్ని సక్రంగా వినియోగించుకుంటే ఆర్ధిక వ్యవస్థలో మంచి వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సొమ్మును ద్రవ్యలోటు కట్టడికి, రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, పెట్టుబడి వ్యయాలకు ప్రభుత్వం వినియోగించుకోవచ్చని అంటున్నారు.

నిబంధనలు సరళతరం
దేశ జీడీపీలో మంచి వృద్ధిరేటు నమోదు అయితే విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరిగే అవకాశం ఉంటుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఇటీవలే పలు రంగాలకు సంభందించిన నిబంధనలను సరళతరం చేసిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు వస్తే దేశీయ స్టాక్ మార్కెట్ పెరగడానికి,పెరగడానికి, రూపాయి బలోపితం కావడానికి అవకాశం ఉంటుంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications