సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) ఏప్రిల్ - జూన్ క్వార్టర్ (Q1) జీడీపీ డేటాను విడుదల చేసే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్ జీడీపీ డేటాను విడుదల చేసే అవకాశముంది. అంతకుముందు క్వార్టర్‌లో 5.8 శాతంగా ఉంది. ఈ క్వార్టర్‌లో 5.7 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు.
రూటర్స్ పోల్ ప్రకారం జూన్ త్రైమాసికంలో ఇండియన్ ఎకానమీ 5.7 శాతం ఉండనుంది. రాయిటర్స్ పోల్‌లో సర్వే చేసిన మొత్తం 65 మందిలో 40 మంది ఆర్థికవేత్తలు ఈ సంఖ్యను 5.6 శాతంగా లేదంటే అంతకంటే తక్కువగా అంచనా వేశారు. అదే జరిగితే భారతదేశ వృద్ధి నెమ్మదిస్తుంది. గత ఏడేళ్లలో చూస్తే అత్యంత బలహీనంగా ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ఇది అవుతుంది. బ్లూమ్‌బర్గ్ కూడా 30 మంది ఆర్థికవేత్తలతో సర్వే నిర్వహించింది. 5.7 శాతంగా ఉంటుందని ఎక్కువమంది అంచనా వేశారు.

ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ Q1 జీడీపీని 5.7 శాతంగా అంచనా వేసింది. వార్షిక వృద్ధి రేటు అంచనాను గతంలోని 7.3 శాతం నుంచి 6.7 శాతానికి సవరించింది.
ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ రూపొందించిన ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో జీడీపీ వృద్ధిని 7 శాతంగా అంచనా వేశారు. ఆర్బీఐ ఆగస్టులో తన జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతానికి తగ్గించింది. జూన్ మానిటరీ పాలసీలో జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి సవరించారు.
ఆయా సంస్థల అంచనా
ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటును రూటర్స్ 5.7 శాతంగా, సీఎల్ఎస్ఏ 5.7 శాతంగా, ఇండియా రేటింగ్స్ 5.7 శాతం, నోమురా 5.7 శాతం అంచనా వేశాయి. ఇయర్లీ జీడీపీ అంచనాల విషయానికి వస్తే... ఎకనామిక్ సర్వే 7 శాతం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.9 శాతం, మూడీస్ 6.2 శాతం, ఏఎన్‌జెడ్ 6.2 శాతం, క్రిసిల్ 6.9 శాతం, యూబీఎస్ 6.7 శాతం అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications