న్యూఢిల్లీ: ఆదాయపన్ను ఫైలింగ్‌కు గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. మూడు రోజుల్లో మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఆ తర్వాత పైన్‌తో ఉంటుంది. ఆలస్యాన్ని బట్టి పెనాల్టీ రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఈ శనివారంలోగా మీ ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం తప్పనిసరి.
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇవి కూడా చదవండి...

వ్యక్తిగత చెల్లింపుదారుల్లో మూడు కేటగిరీలు
ఆదాయపన్ను విభాగం ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మూడు కేటగిరీలుగా ఉన్నాయి. ఇండివిడ్యువల్స్ (60 ఏళ్లలోపు వయస్సు) ఇందులో రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్, సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు వారు), సూపర్ సీనియర్ సిటిజన్స్ (80 ఏళ్లకు మించి వయస్సు).

ఆయా కేటగిరీలకు పన్ను మినహాయింపు ఇలా
రూ.2.5 లక్షలలోపు ఆదాయం కలిగిన వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లతు (60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు) రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు (80 ఏళ్లు పైబడిన వారు) రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ ద్వారా పైల్ చేయవచ్చు..
ఆన్‌లైన్ ద్వారా సులభ ఈ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఇందుకు ఆదాయపన్ను విభాగం సౌకర్యం కల్పించింది.

పాన్ కార్డు లేదా ఆధార్ ద్వారా ఈ-ఫైలింగ్ కోసం రిజిస్టర్
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇండివిడ్యువల్స్ తమ పాన్ కార్డు నెంబర్ ద్వారా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. పాన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఏడు రకాల ఫామ్స్
మొత్తం ఏడు రకాల ఐటీఆర్ పామ్స్ ఉన్నాయి. ITR-1, ITR-2, ITR-3, ITR-4, ITR-5, ITR-6 and ITR-7.

ప్రీ-ఫిల్డ్ ఫామ్స్‌ను జాగ్రత్తగా చూడండి..
ఈసారి ఐటీ రిటర్న్స్ ఫామ్స్ ప్రీ-ఫిల్డ్ పార్మాట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీ-ఫిల్డ్ ఫార్మాట్‌లో ఆదాయం, ట్యాక్స్‌లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ వివరాలను బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డు కంపెనీల వంటి థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచి పొందుతాయి. ముందుగా నింపిన డేటాను జాగ్రత్తగా ధృవీకరించుకోవాలి. అలాగే ఇతర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని జోడించాలి.

ఐటీఆర్ వెరిఫై చేసుకోవాలి
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన అనంతరం వెరిఫై చేసుకోవాలని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటు సూచించింది. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెరిఫికేషన్ కోసం ఐదు మార్గాలు ఇచ్చింది. ఆధార్ OTP (వన్ టైమ్ పాస్‌కోడ్), బ్యాంకు ఏటీఎం, బ్యాంక్ అకౌంట్, డీమాండ్ అకౌంట్, నెట్ బ్యాంకింగ్.

స్టేటస్ తెలుసుకోవచ్చు...
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారు దాని స్టేటస్‌ను ఈ-ఫైలింగ్ పోర్టల్, incometaxindiaefiling.gov.in. ద్వారా చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ట్యాక్స్ పేయర్ తమ పాన్ నెంబర్, అక్నాలెడ్జ్ మెంట్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన అనంతరం ఆదాయపన్ను శాఖ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఇస్తుంది.

ఆలస్య రుసుము...
ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని పక్షంలో ఆలస్య రుసుము రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఆలస్యాన్ని బట్టి జరిమానా ఉంటుంది.
More From GoodReturns

హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..



Click it and Unblock the Notifications