బీజింగ్: భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో తయారైన డ్రగ్స్‌ను 'ఫేక్ మెడిసిన్' జాబితా నుంచి డ్రాగన్ కంట్రీ చైనా తొలగించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి రోగులు ఈ మందులు వాడుకోవచ్చు. చైనాలో జనరిక్ మందుల అంశంపై కఠిన నిబంధనలను చైనా సడలించింది. ఇందులో భారత్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీని ప్రకారం భారత్‌కు చెందిన జనరిక్ మెడిసిన్స్ ఇప్పుడు చైనాలో కొన్ని పరిమితుల మధ్య వినియోగించవచ్చు.డిసెంబర్ 1వ తేదీ నుంచి రోగు ఈ మందులు వాడుకొవచ్చని చైనాకు చెందిన అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

జనరిక్ మెడిసిన్స్‌పై కఠిన నిబంధనలు, చర్యలు
భారత్ సహా విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ మెడిసిన్స్ విషయంలో చైనాలో కఠిన చర్యలు ఉన్నాయి. వాటిని నకిలీ మెడిసిన్స్ కింద పేర్కొనడంతో పాటు జనరిక్ మెడిసిన్స్ చలామణిని అక్రమ వ్యాపారంగా చెబుతోంది. ఇప్పుడు ఈ మందులు ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.

క్యాన్సర్ వంటి రోగులకు శుభవార్త
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ జనరిక్ మెడిసిన్స్‌ను రోగులు ఉపయోగించవచ్చు. అయితే వాటిని తక్కువ పరిమాణంలో మాత్రమే వాటిని తీసుకోవాలి. చైనా టాప్ లెజిస్లేచర్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ముగింపు సెషన్‌లో దీనికి ఆమోదం లభించింది. విదేశాలకు చెందిన జనరిక్ మెడిసిన్స్‌ను ఉపయోగించేందుకు అమోదం లభించడం చైనీయులకు గుడ్ న్యూస్. ఎందుకంటే క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతున్న వారికి ఇవి ప్రయోజనకరం.

చవక ధరకు మందులు...
ఇప్పుడు భారతదేశం నుండి ఎగుమతి అయ్యే జనరిక్ మెడిసిన్స్, ముఖ్యంగా
క్యాన్సర్ వంటి రోగులు తక్కువ ధరకు మందులు పొందగలుగుతారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇవి అక్కడి మెడికల్ దుకాణాలలో లేవు. కాబట్టి వాటిని అప్పుడే పొందలేరు. ఈ ఔషదాలను ఎలా సేకరిస్తారనే అంశంపై స్పష్టత లేదు.

చైనా క్యాన్సర్ బాధితులకు ఆ పరిస్థితి ఉండేది కాదు..
జనరిక్ మెడిసిన్స్‌ను తక్కువ మోతాదులో దిగుమతి చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, లాభాపేక్ష ఆకాంక్షతో పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాలనుకుంటే మరికొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని మీడియా కథనం. చైనాలోని క్యాన్సర్ బాధితులు ఈ జబ్బుకు చవకైన, ప్రభావవంతమైన జనరిక్ మెడిసిన్స్ భారత్ నుంచి దిగుమతి అవుతాయని తెలిసినా వాటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా ఉండేది.

ప్రపంచంలో ఇండియన్ మెడిసిన్స్ టాప్
ఇండియాలో తయారైన జనరిక్ మెడిసిన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందని, ఈ విషయంలో చైనాకు చెందిన మెడిసిన్ సంస్థలు భారత్ నుంచి చాలా నేర్చుకోవాలని, అదే సమయంలో చైనా జనరిక్ మెడిసిన్స్‌ల్లో ఆశించిన స్థాయిలో నాణ్యత లేదని చైనా-ఐరోపా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అన్నారు.


Click it and Unblock the Notifications